కరీంనగర్‌లో సైకో సాప్ట్‌వేర్ ను కాల్చేసిన పోలీసులు
కరీంనగర్ కమాన్ చౌరస్తా వీధిలో ఉదయం కలకలం రేగింది. బల్వీందర్ సింగ్ అనే యువకుడు తల్వార్‌తో తన తల్లిదండ్రులు, స్థానికులపై దాడి చేశాడు. ఉదయం లేవగానే తల్లిదండ్రులపై హఠాత్తుగా తల్వార్‌తో దాడి చేసి విచక్షణ రహితంగా నరికాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వీధిలోకి వచ్చిన బల్వీందర్ అటుగా వెళ్తున్న వారిపైనా దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బల్వీందర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా […]
కరీంనగర్ కమాన్ చౌరస్తా వీధిలో ఉదయం కలకలం రేగింది. బల్వీందర్ సింగ్ అనే యువకుడు తల్వార్‌తో తన తల్లిదండ్రులు, స్థానికులపై దాడి చేశాడు. ఉదయం లేవగానే తల్లిదండ్రులపై హఠాత్తుగా తల్వార్‌తో దాడి చేసి విచక్షణ రహితంగా నరికాడు. వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వీధిలోకి వచ్చిన బల్వీందర్ అటుగా వెళ్తున్న వారిపైనా దాడి చేశాడు. దీంతో పలువురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి బల్వీందర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ముగ్గురు కానిస్టేబుళ్లపైనా తల్వార్‌తో దాడి చేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న సీఐ విజయ్ సారధి తన సర్వీస్ రివాల్వర్‌తో బల్వీందర్‌పై ఒక రౌండ్ కాల్పులు జరిపారు. చాతీ భాగంతో బుల్లెట్ దిగింది. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ చనిపోయాడు. బల్వీందర్ సింగ్ తల్లి బేబీ కౌర్ పరిస్థితి విషమంగా ఉంది. బల్వీందర్ సింగ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు లక్షకు పైగా జీతం వస్తోంది. అయితే సివిల్స్ పరీక్షలకు సిద్దమయ్యేందుకు కొన్ని నెలల క్రితం ఇంటికి వచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా బల్వీందర్ సింగ్ చదువులో మెరిట్ విద్యార్థి అని అతడి స్నేహితులు చెబుతున్నారు. పెద్దగా బయటకు కూడా వచ్చేవాడు కాదంటున్నారు.