మౌనంతో మంత్రులకు గండం

సోమవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కొందరు మంత్రుల పదవులకు గండం తప్పదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. చంద్రబాబు సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడానికి కారణాలున్నాయి. అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై చర్చ సందర్భంగా మంత్రుల పనితీరు నిజంగానే పేలవంగా అనిపించింది. కాల్‌మనీ సమర్థించడం వ్యతిరేకించడం అన్న అంశాన్నిపక్కన పెడితే చిక్కుల్లో పడ్డ పార్టీని రక్షించే కనీస ప్రయత్నం మంత్రులు చేయలేదన్నది సుస్పష్టం. ఒకరిద్దరు తప్పితే మిగిలిన మంత్రులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా […]

Advertisement
Update:2015-12-22 07:35 IST

సోమవారం జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కొందరు మంత్రుల పదవులకు గండం తప్పదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. చంద్రబాబు సీరియస్‌గా వార్నింగ్ ఇవ్వడానికి కారణాలున్నాయి. అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై చర్చ సందర్భంగా మంత్రుల పనితీరు నిజంగానే పేలవంగా అనిపించింది. కాల్‌మనీ సమర్థించడం వ్యతిరేకించడం అన్న అంశాన్నిపక్కన పెడితే చిక్కుల్లో పడ్డ పార్టీని రక్షించే కనీస ప్రయత్నం మంత్రులు చేయలేదన్నది సుస్పష్టం. ఒకరిద్దరు తప్పితే మిగిలిన మంత్రులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉండిపోయారు.

ప్రతి అంశానికి ప్రెస్‌మీట్లు పెట్టే నోరున్న మంత్రులు గానీ, మహిళా మంత్రులు గానీ ఎక్కడా కాల్‌మనీ రగడలో గళమెత్తలేదు. తమకేమీ పట్టనట్టు కూర్చుండిపోయారు. పదేపదే చంద్రబాబే లేచి ప్రతిపక్షాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అసలు మంత్రులు ఉన్నారా వారికి ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధం లేదా అన్న అనుమానం కలిగేలా వ్యవహరించారు. ఈ పరిస్థితిని గమనించే టీడీఎల్పీ సమావేశంలో ” ప్రతిపక్షాన్ని ఎదుర్కొవడం కోసం మీరెందుకు మాట్లాడరు. అన్నీ నేనే మాట్లాడాలా?.మీకు బాధ్యత లేదా” అని మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ”మీరు న్యాయం చేయలేకపోతే చెప్పండి. ప్రత్నామ్నాయం చూసుకుంటా. అప్పుడు మీరు బాధపడవద్దు. అవకాశాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు” అంటూ గట్టిగానే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News