రంగనాథ్‌ ఆఖరి ఎస్‌ఎమ్‌ఎస్‌

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ చివరిసారిగా తన స్నేహితుడు న్యూస్‌పేపర్స్‌ ఎడిటర్ బైసా దేవదాసుకు ఎస్‌ఎంఎస్‌ చేశారు. మధ్యాహ్నం 3. 36 నిమిషాలకు తన మొబైల్ నుంచి ”గుడ్‌ బై సర్” అంటూ మేసేజ్‌ పంపారు. అనంతరం వంటగదిలో ఉరేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గోడపై పెన్‌తో మరో విషయం రాశారు. ”నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంకు బాండ్లు ఉన్నాయి వాటిని […]

Advertisement
Update:2015-12-19 18:48 IST

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ చివరిసారిగా తన స్నేహితుడు న్యూస్‌పేపర్స్‌ ఎడిటర్ బైసా దేవదాసుకు ఎస్‌ఎంఎస్‌ చేశారు. మధ్యాహ్నం 3. 36 నిమిషాలకు తన మొబైల్ నుంచి ”గుడ్‌ బై సర్” అంటూ మేసేజ్‌ పంపారు. అనంతరం వంటగదిలో ఉరేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గోడపై పెన్‌తో మరో విషయం రాశారు.

”నా బీరువాలో పని మనిషి మీనాక్షి పేరు మీద ఉన్న ఆంధ్రాబ్యాంకు బాండ్లు ఉన్నాయి వాటిని ఆమెకు అప్పగించండి. డోంట్ ట్రబుల్ హర్‌” ( ఆమెను ఇబ్బంది పెట్టవద్దు) అని రాశారు. శనివారం ఆయన ఒక సన్మాన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. ఆయనను తీసుకెళ్లేందుకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. అడ్రస్ కనుక్కొని రంగనాథ్‌ ఇంటికి వెళ్లారు. అయితే లోపల గడియ వేసి ఉండడంతో కూతురికి సమాచారం అందించారు. కూతురు సమక్షంలోనే తలుపులు బద్ధలుకొట్టిలోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆయన ఆపస్మారక స్థితిలో ఉన్నారు. ఆస్పత్రికి తరలించగా రంగనాథ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఒంటరితనం, అనారోగ్యం కారణంగానే రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. 2009లో భార్య చైతన్య మృతి చెందిన తర్వాత ఆయన ఒంటరి అయిపోయారు. పనిమనిషి మీనాక్షి గత ఐదు సంవత్సరాలుగా రంగనాధ్‌కు సేవలు అందిస్తూ వంట చేసి పెడుతున్నారు. పెద్దకూతురు రంగనాథ్ ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. చిన్నకూతురు, కుమారుడు బెంగళూరులో ఉంటున్నారు.

Tags:    
Advertisement

Similar News