ఆత్మహత్యపై రంగనాథ్‌ ఏం చెప్పారంటే!

సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య అందరినీ కలచివేస్తోంది. ఒంటరితనాన్ని భరించలేక ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రంగనాథ్‌ యవ్వనంలో ఉండగానే ఒకసారి ఆత్మహత్య చేసుకోబోయారు. ఒక దశలో తన స్నేహితులంతా ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోవడంతో రంగనాథ్‌ మానసిక వేధనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆత్మహత్య చేసుకునేందుకు ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో రైలు పట్టాలపై కూర్చుకున్నారట. అయితే అదృష్టవశాత్తు ట్రైన్ లేటు అవడంతో ఆత్మహత్య ఆలోచన మారిపోయిందన్నారు. […]

Advertisement
Update:2015-12-20 13:41 IST

సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య అందరినీ కలచివేస్తోంది. ఒంటరితనాన్ని భరించలేక ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రంగనాథ్‌ యవ్వనంలో ఉండగానే ఒకసారి ఆత్మహత్య చేసుకోబోయారు. ఒక దశలో తన స్నేహితులంతా ఎయిర్‌ఫోర్స్‌కు వెళ్లిపోవడంతో రంగనాథ్‌ మానసిక వేధనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆత్మహత్య చేసుకునేందుకు ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో రైలు పట్టాలపై కూర్చుకున్నారట. అయితే అదృష్టవశాత్తు ట్రైన్ లేటు అవడంతో ఆత్మహత్య ఆలోచన మారిపోయిందన్నారు. అప్పుడే తనను ఆర్టిస్ట్‌గా చూడాలన్న తల్లి కోరిక గుర్తుకొచ్చిందని వెంటనే మద్రాస్ వెళ్లిపోయానని చెప్పారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తుందని.. కానీ ఆ క్షణాన్ని కాస్త అధిగమించగలిగితే ముందుకెళ్లగలుగుతామని గతంలో ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News