బయటపడ్డ రూ. 50 కోట్ల లక్ష్మీ విగ్రహం, సీఎంకు అందజేత

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ అత్యంత విలువైన పంచలోహ విగ్రహం బయటపడింది. ఈ లక్ష్మి దేవి విగ్రహం విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నదీ తీర ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకునేందుకు ఉదయభాస్కర్‌ అనే వ్యక్తి పునాదులు తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడింది. కొద్దిరోజుల క్రితమే ఈ విగ్రహం దొరికింది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్నారని చుట్టుపక్కల వారు భావించారు. అయితే ఉదయభాస్కర్‌ సీఎం చంద్రబాబును క్యాంపు ఆఫీస్‌లో కలిసి […]

Advertisement
Update:2015-12-19 11:55 IST

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ అత్యంత విలువైన పంచలోహ విగ్రహం బయటపడింది. ఈ లక్ష్మి దేవి విగ్రహం విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నదీ తీర ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకునేందుకు ఉదయభాస్కర్‌ అనే వ్యక్తి పునాదులు తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడింది. కొద్దిరోజుల క్రితమే ఈ విగ్రహం దొరికింది. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకున్నారని చుట్టుపక్కల వారు భావించారు. అయితే ఉదయభాస్కర్‌ సీఎం చంద్రబాబును క్యాంపు ఆఫీస్‌లో కలిసి విగ్రహాన్ని అందజేశారు. ఇంత విలువైన విగ్రహాన్ని తీసుకొచ్చి ఇచ్చిన ఉదయభాస్కర్‌ను చంద్రబాబు మొచ్చుకున్నారు. అయితే విగ్రహం దొరికిన చోటే లక్ష్మీదేవి ఆలయం కడదామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇలా లక్ష్మిదేవి ఆలయం కట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News