సోము వీర్రాజుకు బాబు చెక్
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇప్పుడు రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి రేసులో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చాలా కాలంగా జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా అంతే స్థాయిలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. ఏపీకి సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆయన పార్టీ నేతలు తప్పుడు […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఇప్పుడు రెండు వర్గాల మధ్య వార్ నడుస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి పదవీకాలం త్వరలో ముగుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడి రేసులో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని చాలా కాలంగా జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా అంతే స్థాయిలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. ఏపీకి సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించడం మొదలు పెట్టారు.
ఇక్కడే సోము వీర్రాజుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్టు తెలుస్తోంది. సోము వీర్రాజు విమర్శలు సహజంగానే టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో చంద్రబాబు ఢిల్లీలోని కమలం పెద్దలతో మాట్లాడి వీర్రాజుకు అధ్యక్ష పదవి రాకుండా చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు తమతో సఖ్యతగా ఉంటున్న కంభంపాటికే మరోసారి అవకాశం ఇవ్వాలని బాబు సూచించినట్టు తెలుస్తోంది. కంభంపాటి కూడా మరోసారి అధ్యక్షుడిగా తనకే అవకాశం ఇవ్వాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ కంభంపాటికి కుదరని పక్షంలో ఈసారి రాయలసీమ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలన్న చర్చను తెరపైకి తెస్తున్నారు. రాయలసీమలో సీనియర్ మహిళా నాయకురాలు శాంతారెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు. శాంతారెడ్డికి బీజేపీ అగ్రనేతలతోనూ మంచి పరిచయాలు ఉండడం కూడా కలిసి రావచ్చంటున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీలో అధ్యక్షుడిగా వీర్రాజు ఆయన వర్గం నాయకులకు అవకాశం రాకుండా చంద్రబాబుతోపాటు కేంద్రంలో వెంకయ్య నాయకుడు కూడా మద్దతు కూడగడుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement