కాల్ మనీ అసలు స్వరూపం ఇదీ!
కాల్ మనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. ఇంతకూ కాల్ మనీ అంటే ఏంటి? ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. అత్యవసర సమయానికి డబ్బు అందించడాన్నే కాల్ మనీ అంటారు. నిజానికి దీన్ని కేవలం ఇంటర్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో మాత్రమే అనుసరిస్తారు. బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే నగదు నిల్వలు మెంటైన్ చేయడానికి ఇతర బ్యాంకులను సర్దుబాటు చేసుకునే […]
Advertisement
కాల్ మనీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. ఇంతకూ కాల్ మనీ అంటే ఏంటి? ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. అత్యవసర సమయానికి డబ్బు అందించడాన్నే కాల్ మనీ అంటారు. నిజానికి దీన్ని కేవలం ఇంటర్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో మాత్రమే అనుసరిస్తారు. బ్యాంకింగ్ పరిభాషలో చెప్పాలంటే నగదు నిల్వలు మెంటైన్ చేయడానికి ఇతర బ్యాంకులను సర్దుబాటు చేసుకునే విధానం. ఇందులో 15 రోజుల్లోపు ఒకరు మరొకరికి ఇచ్చుకునే స్వల్పకాలిక రుణం. మన వాడుక భాషలో దీన్నే చేబదులు కూడా అనొచ్చు.
ఇలా ఇచ్చిన రుణాలకు వడ్డీని వసూలు చేస్తారు. ఎక్కువగా ఈ కాల్ మనీ బ్యాంకుల మధ్య జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కాల్ మనీ వ్యవహారం వేరు. సమయానికి డబ్బు అందించే ఫెసిలిటీని ఏపీలో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీల కోసం వాడుకుంటున్నారు. ఏకంగా విజయవాడలో దీన్ని ఓ మాఫియాగా మార్చేశారు. ఈ కాల్ మనీ టర్నోవర్ ఏడాదికి 600 కోట్లు ఉంటుందని అంచనా.
విజయవాడలో కాల్ మనీ వ్యాపారులు పూర్తి అర్థం మార్చేశారు. అవసరం ఉందంటే చాలు అరగంటలో అప్పు ఇస్తారు. ఆపదలో ఆదుకున్నారు కదా. వారు మహానుభావులు అనుకుంటాం. కానీ ఆతర్వాతే కాల్ మనీ వ్యాపారుల అసలు స్వరూపం బయటకొస్తుంది. వడ్డీని, రుణాన్ని ఎప్పుడైనా వసూలు చేసుకోవచ్చన్న నిబంధనలను సాకుగా చూపి బాధితులు తీసుకున్న రుణాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. రుణం తీసుకున్న వ్యక్తి అసలు చెల్లించినా వడ్డీ కట్టాలంటూ వేధిస్తున్నారు. ఎంతలా అంటే 30వేలు రుణం తీసుకుంటే 3లక్షలు వసూలు చేస్తున్నారు.
ఇక వడ్డీ చెల్లించలేనివారి ఆస్తులు దబాయించి రాసేసుకుంటున్నారు. ఖాతరు చేయకపోతే రుణం తీసుకున్నవారి ఇళ్లకు రౌడీలను పంపి బెదిరిస్తున్నారు. కేవలం వడ్డీలు వసూలు చేసుకోవడంతో ఆగలేదు. ఆర్థిక అవసరాలను చూపించి మహిళలను లైంగికంగా వాడుకోవడమే కాకుండా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని బాధితులు పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకోవడం అందర్నీ కదిలింపజేస్తున్నాయి.
Advertisement