వైఎస్‌ మరణంపై జగన్ అనుమానం!

బాక్సైట్, విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు మోపడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. బాక్సైట్ జోలికి వస్తే గిరిజనులు చంద్రబాబు తల నరుకుతారని బహిరంగసభలో ఒక వ్యాఖ్య అన్నందుకే  గిడ్డి ఈశ్వరిపై హత్యాయత్నం కేసు నమోదు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్ చనిపోవడానికి రెండు రోజుల ముందు ఇదే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ”ఇక నీవు తిరిగి […]

Advertisement
Update:2015-12-15 07:19 IST
బాక్సైట్, విజయవాడ కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ గిరిజన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై సెక్షన్‌ 307 కింద హత్యాయత్నం కేసు మోపడంపై జగన్ తీవ్రంగా స్పందించారు. బాక్సైట్ జోలికి వస్తే గిరిజనులు చంద్రబాబు తల నరుకుతారని బహిరంగసభలో ఒక వ్యాఖ్య అన్నందుకే గిడ్డి ఈశ్వరిపై హత్యాయత్నం కేసు నమోదు ఎంతవరకు సమంజసమని
ప్రశ్నించారు. వైఎస్ చనిపోవడానికి రెండు రోజుల ముందు ఇదే చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ”ఇక నీవు తిరిగి అసెంబ్లీకి వస్తేనే కదా” అని వైఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. అలా చంద్రబాబు అన్న రెండు రోజులకే వైఎస్ చనిపోయారని … దీని అర్థం వైఎస్‌ను చంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మరి అలాంటప్పుడు చంద్రబాబుపై హత్యానేరం ఎందుకు మోపడం లేదని నిలదీశారు.
ఇప్పటికీ టీడీపీతో పెట్టుకోవడం వల్లే వైఎస్ పావురాల గుట్టలో పావురమైపోయారని చంద్రబాబు పదేపదే వ్యాఖ్యానిస్తుంటారని దీనిపైన ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు మేనేజర్ గంట ముందే కౌంటర్ మూసివేయగా 19 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారన్నారు. ఆ సమయంలో ప్రయాణికులకు అండగా మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై చంద్రబాబు ఆదేశాల మేరకే కేసులు నమోదుచేశారని జగన్‌ మండిపడ్డారు. నిజంగా మేనేజర్‌ను మిథున్ రెడ్డి కొట్టి ఉంటే సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. బాక్సైట్‌పై గిరిజన సలహామండలిని ఏర్పాటు చేయకపోవడంపైనా గరవ్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు జగన్.
Tags:    
Advertisement

Similar News