మనసులో మాట బయటపెట్టిన రేవంత్
ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లిన రోజునే టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన పాపాలను కడిగేసుకునేందుకే చండీయాగం నిర్వహిస్తున్నారని విమర్శించారు. అంతవరకుబాగానే ఉంది. మరి పాప ప్రక్షాళనకు కేసీఆర్ చేసుకుంటున్న యాగానికి చంద్రబాబు హాజరు కారా అంటేమాత్రం రేవంత్ రెడ్డి మరో విధంగా స్పందించారు. చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానించడం వారి వ్యక్తిగతమని చెప్పారు. దాన్నిరాజకీయ కోణంలో చూడకూడదన్నారు. అదే సమయంలో తన కూతురు వివాహాన్ని ప్రస్తావించారు. తన […]
ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లిన రోజునే టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన పాపాలను కడిగేసుకునేందుకే చండీయాగం నిర్వహిస్తున్నారని విమర్శించారు. అంతవరకుబాగానే ఉంది. మరి పాప ప్రక్షాళనకు కేసీఆర్ చేసుకుంటున్న యాగానికి చంద్రబాబు హాజరు కారా అంటేమాత్రం రేవంత్ రెడ్డి మరో విధంగా స్పందించారు. చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానించడం వారి వ్యక్తిగతమని చెప్పారు. దాన్నిరాజకీయ కోణంలో చూడకూడదన్నారు. అదే సమయంలో తన కూతురు వివాహాన్ని ప్రస్తావించారు.
తన కూతురు వివాహానికి కేసీఆర్ను ఆహ్వానించబోనన్నారు. కేసీఆర్ తనకు స్నేహితుడు కాదని అందుకే ఆహ్వానించబోనని చెప్పారు. అంటే పాప ప్రక్షాళనకోసం కేసీఆర్ చేసుకుంటున్న యాగానికి రావద్దని చంద్రబాబుకు పరోక్షంగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నారా?. కేసీఆర్ తనకు స్నేహితుడు కాదు కాబట్టి కూతురు పెళ్లికి ఆహ్వానించబోనని రేవంత్ చెబుతున్నారు. అంటే కార్యక్రమాలకు పరస్పరం ఆహ్వానించుకుంటున్న చంద్రబాబు, కేసీఆర్లు ఇద్దరూ చేతులు కలిపి స్నేహితులుగా మారారని రేవంత్ భావిస్తున్నారా?.