ఆ నవ్వు ఎందుకు మాయమైంది?

పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ రాష్ట్రానికి తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నేత. ఆయనకున్న మంచి లక్షణాల్లో నవ్వు ఒకటి. ఎప్పుడూ నవ్వుతూ.. తన చుట్టు  పక్కల వారిని కూడా నవ్విస్తూ ఒక మంచి వాతావరణం సృష్టిస్తుంటారు. ఈయన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన జర్నలిస్టులను జోకులేసి నవ్వించేవారు. తనపై తానే జోకులేసుకోవడం కూడా పొన్నాల స్పెషాలిటి. అయితే కొంత కాలంగా పొన్నాలలో ఆ నవ్వులు కనిపించడం లేదట. ఎప్పుడూ సీరియస్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధుల వద్ద […]

Advertisement
Update:2015-12-13 23:01 IST
ఆ నవ్వు ఎందుకు మాయమైంది?
  • whatsapp icon
పొన్నాల లక్ష్మయ్య. తెలంగాణ రాష్ట్రానికి తొలి పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నేత. ఆయనకున్న మంచి లక్షణాల్లో నవ్వు ఒకటి. ఎప్పుడూ నవ్వుతూ.. తన చుట్టు పక్కల వారిని కూడా నవ్విస్తూ ఒక మంచి వాతావరణం సృష్టిస్తుంటారు. ఈయన ప్రెస్‌మీట్‌కు వెళ్లిన జర్నలిస్టులను జోకులేసి నవ్వించేవారు. తనపై తానే జోకులేసుకోవడం కూడా పొన్నాల స్పెషాలిటి. అయితే కొంత కాలంగా పొన్నాలలో ఆ నవ్వులు కనిపించడం లేదట. ఎప్పుడూ సీరియస్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియా ప్రతినిధుల వద్ద కూడా గంభీరంగానే ఉంటున్నారట. ఇలా ఎందుకు మారిపోయారని పొన్నాల అనుచరుల దగ్గర ఆరా తీయగా అందుకు అసలు కారణం చెప్పారు.
పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఈ నవ్వుపైనే కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్ దగ్గర ఫిర్యాదు చేశారట. పీసీసీ అధ్యక్షుడిగా హుందాగా ఉండాల్సిందిపోయి సీరియస్‌నెస్ లేకుండా ఎప్పుడూ జోకులేస్తున్నారని ఫిర్యాదుచేశారు. పార్టీ ఓటమి తర్వాత ఇలాంటి ఫిర్యాదులు పోటెత్తాయట. పీసీసీ చీఫ్‌గా ప్రతి దానికి నవ్వుతూ చివరకు పార్టీని కూడా నవ్వుల పాలు చేశారని లేనిపోనివి హైకమాండ్ చెవిలో ఊదారు. దీనిపై అప్పట్లో హైకమాండ్‌ పెద్దలు కూడా పొన్నాల నవ్వుపై ఆగ్రహం వ్యక్తంచేశారట. దీంతో బాగా నొచ్చుకున్న పొన్నాల అప్పటి నుంచి ఇలా తనలోని ఫీలింగ్స్ అణచుకుని తిరుగుతున్నారని చెబుతున్నారు. అయితే…
పొన్నాల నవ్వుల వల్లే పార్టీ ఓడిపోయిందని హైకమాండ్‌కు చెప్పారు బాగానే ఉంది. 2014 ఎన్నికల్లో ఓటమి నిందమొత్తం పొన్నాల మీదకే తోసేశారు. మరి ఇప్పుడు పార్టీని నడుపుతున్న సీరియస్ సీనియర్‌ నేతలు ఏం సాధించారన్నది పొన్నాలను అభిమానించే వారి ప్రశ్న. నవ్వకుండా గంభీరంగా ఉండడమే నాయకత్వ లక్షణం అని చెప్పిన నేతలు… మరి వరంగల్ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. తమ పొన్నాల గతంలోలాగా నవ్వుతూ ఉండాలని వారు కోరుతున్నారు. కాసింత నవ్వండి పొన్నాల గారు.
Tags:    
Advertisement

Similar News