రిపబ్లిక్ వేడుకల్లో తెలంగాణ శకటానికి దక్కని చోటు!
రిపబ్లిక్ పరేడ్‌లో కొత్త రాష్ట్రం తెలంగాణ శకటానికి మరోసారి భంగపాటు ఎదురైంది. 2016 రిపబ్లిక్ ఉత్సవాల కోసం ప్రభుత్వం పంపిన శకటానికి రక్షణ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారని తెలిసింది. దీంతో రాబోయే రిపబ్లిక్ ఉత్సవాల్లో పాల్గొనకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ శకటాలకు అనుమతి లభించకపోవడం ఇది కొత్తేం కాదు! 2015లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కొత్త రాష్ట్రం తెలంగాణకు తొలిసారి అవకాశం వచ్చింది. అయితే, అప్పుడు కూడా రక్షణ అధికారుల కమిటీ తెలంగాణ […]
Advertisement
రిపబ్లిక్ పరేడ్‌లో కొత్త రాష్ట్రం తెలంగాణ శకటానికి మరోసారి భంగపాటు ఎదురైంది. 2016 రిపబ్లిక్ ఉత్సవాల కోసం ప్రభుత్వం పంపిన శకటానికి రక్షణ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారని తెలిసింది. దీంతో రాబోయే రిపబ్లిక్ ఉత్సవాల్లో పాల్గొనకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ శకటాలకు అనుమతి లభించకపోవడం ఇది కొత్తేం కాదు! 2015లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో కొత్త రాష్ట్రం తెలంగాణకు తొలిసారి అవకాశం వచ్చింది. అయితే, అప్పుడు కూడా రక్షణ అధికారుల కమిటీ తెలంగాణ శకటాన్ని అనుమతించలేదు. దీంతో టీఆర్ ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఓ బృందం రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ను కలిసి విజ్ఞప్తి చేసి ఒప్పించారు. పైగా ఆ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా పొల్గొన్నాడు. దీంతో కొత్త రాష్ట్రం గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం దక్కుతుందని జితేందర్ రెడ్డి చేసిన వినతితో ఏకీభవించి ఎట్టకేలకు అనుమతించారు. కానీ, రెండోసారి కూడా తెలంగాణ శకటాన్ని తిరస్కరించడాన్ని తెరాస ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రతిసారీ అడుక్కోవాల్సిన గత్యంతరం తమకు పట్టలేదని 2016లోనే కాదు, ఇకపై జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
అక్టోబరులోనే పంపినా..!
ఈ సారి రిపబ్లిక్ వేడుకల కోసం సమ్మక్క సారక్క జాతర, పేరిణి శివతాండవం, నటరాజ నృత్యం, బతుకమ్మలతో కూడిన శకటాన్ని మూడుసార్లు సెలక్షన్ కమిటీ ముందుకు పంపారు. ఆ మూడుసార్లు తిరస్కారంపై ఎలాంటి నిర్ణయం తెలపని అధికారులు డిసెంబరు 10న ఈ శకటానికి అనుమతి నిరాకరిస్తున్నామని అనధికారికంగా తెలియజేశారని తెలంగాణ సమాచార శాఖ అధికారులు వెల్లడించారు. సెలక్షన్ కమిటీ చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం ప్రకటించడంపై ఎంపీ జితేందర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. కనీసం తిరస్కార సమాచారం తెలపడంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. మరోవైపు ఏపీకి చెందిన అమరావతి శకటానికి అధికారులు ఆమోదం తెలపడంతో వారు ఈ శకటాన్ని 3-డీ రూపంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.