బాబును చూసి నేర్చుకో జగన్!
బెజవాడ కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతోంది. అన్నిపార్టీల నేతలు స్పందిస్తున్నారు. వైసీపీ నుంచి కొడాలినాని, పార్థసారథి, వాసిరెడ్డి పద్మ లాంటి వారు స్పందించారు. అయితే జగన్ మాత్రం కనిపించడం లేదు. అధిక వడ్డీలు మాత్రమే వసూలు చేస్తుంటే సరే అనుకోవచ్చు… కానీ వందలాది మంది మహిళల జీవితాలతో కాల్ మనీ ముఠా ఆడుకుంది. అవసరానికి డబ్బు ఇచ్చి… అది తీర్చలేని సమయంలో మహిళల శరీరాలే వాడుకున్నారు. ఇంతటి సీరియస్ అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేతగా […]
Advertisement
బెజవాడ కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతోంది. అన్నిపార్టీల నేతలు స్పందిస్తున్నారు. వైసీపీ నుంచి కొడాలినాని, పార్థసారథి, వాసిరెడ్డి పద్మ లాంటి వారు స్పందించారు. అయితే జగన్ మాత్రం కనిపించడం లేదు. అధిక వడ్డీలు మాత్రమే వసూలు చేస్తుంటే సరే అనుకోవచ్చు… కానీ వందలాది మంది మహిళల జీవితాలతో కాల్ మనీ ముఠా ఆడుకుంది. అవసరానికి డబ్బు ఇచ్చి… అది తీర్చలేని సమయంలో మహిళల శరీరాలే వాడుకున్నారు. ఇంతటి సీరియస్ అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కనీసం ఒక ప్రెస్‌మీట్ పెట్టి ఖండించకపోవడం అతి పెద్ద విషాదం. గాల్లోకి ఒక ప్రెస్ నోట్ విసిరేసి అదే తన స్పందన అంటే ప్రతిపక్ష నేతగా జగన్ సమర్థతను శంకించాల్సిందే. వందల మంది మహిళల మానాలు మంటకలిసిన ఘటనపై జగన్ స్పందించడం లేదంటే అది ఎంతవరకు సబబో ఆయనకు ఆయనే ప్రశ్నించుకోవాలి. పదేపదే చంద్రబాబు ఈ అంశంపై స్పందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసే అర్హత వైసీపీకి ఉందా అన్ని కూడా ఆ పార్టీ నేతలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
కాల్‌దందాలో ఉన్నది టీడీపీ నేతలు కాబట్టి చంద్రబాబు ఆచితూచి స్పందించడం ఊహించిన పరిణామమే. మరి చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ నేతలు ముందుగా తమ నాయకుడు ఎందుకు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం లేదో చెబితే బాగుంటుంది. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాల్ మనీ అంశాన్ని లేవనెత్తుతామని కూడా వైసీపీ నేతలంటున్నారు. అంటే అంతవరకు జగన్ ఈ అంశంపై మాట్లాడరన్న మాట. జగన్ లాంటి గొప్పవాళ్లు మాట్లాడాలంటే అసెంబ్లీ ఒక్కటే ఘనమైన వేదికనా?. ఒకవేళ జగన్ స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే ఈ పాటికి అధికార పక్షానికి నిజంగా చుక్కలే కనిపించేవి. ఈ నాలుగు రోజుల్లోనే కాల్ మనీ అంశంపై కనీసం ఓ పది సార్లు చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి సమాజం ఎటుపోతోందంటూ ఉతికేసేవారు. జగన్కు మాత్రం ఆ ఆలోచన కూడా ఉన్నట్టు కనిపించడం లేదు.
Advertisement