కాల్ మనీ- ఆ ఎమ్మెల్యే ఈజీ టార్గెట్ ఎలా అయ్యారు?
కాల్ మనీ కామాంధుల అరాచక అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రమేయం ఉండడంతో రాజకీయంగానూ పెను దూమారం రేగుతోంది. అయితే కాల్ దందా వెనుక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ హస్తం ఉందని మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. కానీ వీరందరిలోనూ పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈజీ టార్గెట్గా మారారు. కనీసం తనను తాను డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిలోకి బోడె ప్రసాద్ పడిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా […]
కాల్ మనీ కామాంధుల అరాచక అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని వెనుక కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రమేయం ఉండడంతో రాజకీయంగానూ పెను దూమారం రేగుతోంది. అయితే కాల్ దందా వెనుక మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ హస్తం ఉందని మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. కానీ వీరందరిలోనూ పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈజీ టార్గెట్గా మారారు. కనీసం తనను తాను డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిలోకి బోడె ప్రసాద్ పడిపోయారు.
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపేరు కూడా బయటకు వచ్చినా కాల్‌మనీతో తనకు సంబంధంలేదని తన సోదరుడు వడ్డీ వ్యాపారంచేస్తుంటారని చెప్పి తనపై ఆరోపణల తీవ్రతను తగ్గించుకుంటున్నారు. ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కాల్ మనీ- సెక్స్ రాకెట్ బట్టబయలైన సమయంలోనే బోడే ప్రసాద్ విదేశాల్లో విహరిస్తున్నారు. అది కూడా కాల్ మనీ దందాలో అత్యంత కీలకమైన వ్యక్తిని వెంటపెట్టుకుని షికార్లుచేస్తుండడంతో బోడె అడ్డంగా బుక్కయ్యారు. కొందరు మహిళలతో పాటు బోడె ప్రసాద్, కాల్ మనీ కీలక నిందితుడు కలిసి విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలు కూడా మీడియాకు చిక్కడంతో టీడీపీ ఎమ్మెల్యే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఒక వేళ
బోడె ప్రసాద్ ఈ సమయంలో విదేశాలకు వెళ్లి ఉండకపోతే మిగిలిన ఎమ్మెల్యేల్లాగే ఆయన కూడా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేందుకు అవకాశం ఉండేది.
Click to Read: బాబును చూసి నేర్చుకో జగన్!
ప్రస్తుతం కనీసం బోడె ప్రసాద్‌కు అనుకూలంగా మాట్లాడే సాహనం ఏ ఒక్క టీడీపీ నేత చెయడం లేదు. బోడెకు అండగా నిలిస్తే తమను కూడా కాల్ మనీ వికృత క్రీడలో భాగస్వాములుగా భావించే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో బోడె ప్రసాద్ అనుచరులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడడం లేదు. ”బ్యాడ్ టైమ్ కాకుంటే మా ఎమ్మెల్యే ఇప్పుడే విదేశాలకు వెళ్లాలా.. అది కూడా కాల్ మనీలో కీలక వ్యక్తిని వెంటబెట్టుకునే వెళ్లాలా… ఆ ఫోటోలు మీడియాచేతిలోనే పడాలా…అంతా బోడె గారి బ్యాడ్ టైమ్” అంటూ ఆయన అనుచరులు నిట్టుర్పు వీడుస్తున్నారు. కాల్ మనీలో బోడె ప్రసాద్ రూ. 3 కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు.