భర్తలు జైలుకెళ్తే... భార్యలు జెండా మోశారు
వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని జగన్‌ను సొంత జిల్లాలోనే బలహీనపరచాలన్న టీడీపీ నేతల ఐడియా బాగానే ఉన్నా అది అంత ఈజీగా జరిగే సూచనలు కనిపించడం లేదు. దశాబ్దాలుగా టీడీపీ తరపున జమ్మలమడుగులో పోరాటం చేస్తున్న రామసుబ్బారెడ్డి … ఈ విషయంలో గట్టిగానే ఉన్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకిచేర్చుకుంటే నియోజకవర్గంలో కలిసి పనిచేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుంటారన్న వార్తల నేపథ్యంలో జమ్మలమడుగులో టీడీపీ శ్రేణులు జనచైతన్యయాత్రలో కూడా పాల్గొనడం లేదు. గత పదేళ్ల […]
వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని జగన్‌ను సొంత జిల్లాలోనే బలహీనపరచాలన్న టీడీపీ నేతల ఐడియా బాగానే ఉన్నా అది అంత ఈజీగా జరిగే సూచనలు కనిపించడం లేదు. దశాబ్దాలుగా టీడీపీ తరపున జమ్మలమడుగులో పోరాటం చేస్తున్న రామసుబ్బారెడ్డి … ఈ విషయంలో గట్టిగానే ఉన్నారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకిచేర్చుకుంటే నియోజకవర్గంలో కలిసి పనిచేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకుంటారన్న వార్తల నేపథ్యంలో జమ్మలమడుగులో టీడీపీ శ్రేణులు జనచైతన్యయాత్రలో కూడా పాల్గొనడం లేదు.
గత పదేళ్ల కాలంలో టీడీపీ నాయకులను జైలుకు పంపితే వారి భార్యలు టీడీపీ జెండా మోశారని రామసుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందాన్ని కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. ఆదిని చేర్చుకునే విషయంలో తాను కార్యకర్తల మాటకే కట్టుబడి ఉంటానని చెప్పారు. ఆదినారాయణరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పదవులు ఇచ్చినా తీసుకోబోనని అలా చేస్తే కార్యకర్తల్లో తనపై ఉన్న నమ్మకం పోతుందన్నారు. కడపజిల్లా ఎర్రగుంట్లో రామసుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.