ఐ ఎస్ ఐ ఎస్ పై గళమెత్తిన ముస్లింలు

తీవ్రవాద దాడులతో ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా అస్సాంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వృద్ధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు ఇస్లాం కు విరుద్ధమైనవని వీరు నినదించారు. “ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకం అని మేం స్పష్టం చేయదలుచుకున్నాం. అన్నిరకాల తీవ్రాదానికి, హత్యలకు, భయోత్పాతం సృష్టించడానికైనా ఇస్లాం వ్యతిరేకం. జనాన్ని విచ్చలవిడిగా హతమారుస్తున్న ఐఎస్ఐఎస్ తో సహా అన్ని రకాల తీవ్రవాద కార్యకలాపాలను మేం నిరసిస్తున్నాం” అని ర్యాలీ నిర్వాహకులలో […]

Advertisement
Update:2015-12-10 05:23 IST

తీవ్రవాద దాడులతో ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా అస్సాంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వృద్ధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు ఇస్లాం కు విరుద్ధమైనవని వీరు నినదించారు.

అస్సాంలో ఐఎస్ఐఎస్ వ్యతిరేక ర్యాలీ

“ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకం అని మేం స్పష్టం చేయదలుచుకున్నాం. అన్నిరకాల తీవ్రాదానికి, హత్యలకు, భయోత్పాతం సృష్టించడానికైనా ఇస్లాం వ్యతిరేకం. జనాన్ని విచ్చలవిడిగా హతమారుస్తున్న ఐఎస్ఐఎస్ తో సహా అన్ని రకాల తీవ్రవాద కార్యకలాపాలను మేం నిరసిస్తున్నాం” అని ర్యాలీ నిర్వాహకులలో ఒకరైన ఎస్.హెచ్. చౌదరి స్పష్టం చేశారు. ఇస్లాం ను అపఖ్యాతి పాలు చేస్తున్న ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై యుద్ధం ప్రకటిస్తున్నామని చౌదరి అన్నారు.

వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొనడం శుభ సూచకమని గౌహతి విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ అబ్దుల్ మన్నాన్ అభిప్రాయపడ్డారు. మదర్సాలలో చదువుకునే విద్యార్థులు సైతం ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. ఇస్లామిక్ మతతత్వ వాదం వల్ల ఇస్లాం మతానికి తీవ్రమైన ముప్పు ఉందని మన్నాన్ చెప్పారు. “ఇస్లాం అమానుషంగా వ్యవహరించమని చెప్పదు కాని అర్థ రహిత హింసాకాండకు పాల్పడే వారు ఇస్లాంను భ్రష్టు పట్టిస్తున్నారు” అని పత్రికా రచయిత జియా ఉర్ రహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News