రక్షణ మంత్రి పుట్టిన రోజుకు 20 కోట్లు

ఉత్సవాలు, వేడుకలు అంటే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు ఇష్టం లేదట. కాని డిసెంబర్ 13న జరిగే తన జన్మదినోత్సవానికి మాత్రం రూ. 20 కోట్లు ఖర్చవుతాయట. ఇష్టం ఉంటే ఇంకెన్ని కోట్లు ఖర్చయ్యేవో! పుట్టిన రోజున ఆయనకు భారీ ఎత్తున సన్మానం కూడా చేయబోతున్నారు. ఒక వేపు చెన్నై ప్రజలు ఎడతెగని వర్షాల వల్ల తిండీ తిప్పలు లేక అలమటించి పోతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న పారికర్ భారీగా ఖర్చు పెట్టి జన్మదినం ఎలా […]

Advertisement
Update:2015-12-09 00:33 IST

ఉత్సవాలు, వేడుకలు అంటే రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కు ఇష్టం లేదట. కాని డిసెంబర్ 13న జరిగే తన జన్మదినోత్సవానికి మాత్రం రూ. 20 కోట్లు ఖర్చవుతాయట. ఇష్టం ఉంటే ఇంకెన్ని కోట్లు ఖర్చయ్యేవో! పుట్టిన రోజున ఆయనకు భారీ ఎత్తున సన్మానం కూడా చేయబోతున్నారు. ఒక వేపు చెన్నై ప్రజలు ఎడతెగని వర్షాల వల్ల తిండీ తిప్పలు లేక అలమటించి పోతుంటే కేంద్ర మంత్రిగా ఉన్న పారికర్ భారీగా ఖర్చు పెట్టి జన్మదినం ఎలా జరుపుకుంటారు, ఆ డబ్బు చెన్నై వరద బాధితులకు ఇచ్చేయొచ్చుగా అని గోవా కాంగ్రెస్ నాయకులు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.

పరికర్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో 900 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించింది. గనులు మూసేయడం వల్ల గోవాలో అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇందుకేనా ఆయన సన్మానాలు చేయించుకుంటున్నది అని కాంగ్రెస్ ధర్మ సందేహం. పారికర్ ఘనతను కీర్తించే వారికీ లోటు లేదు. శాసన సభ్యుడు, బీజేపీ నాయకుడు సాన్ క్వెలిం పారికర్ గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించిన అభివృద్ధి ఏ కాంగ్రెస్ నాయకుడూ సాధించలేదు తెలుసా అని జ్ఞాన బోధ చేస్తున్నారు. జన్మదినానికి అంత ఖర్చు ఎందుకు అని అడిగితే “కనీసంగా అంత ఖర్చు అవుతుంది” అని ఆ బీజేపీ నాయకుడు తడుముకోకుండా సమాధానం ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News