పోలవరం బాధితులకు వార్నింగ్‌లు సబబేనా?

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు వెంటనే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చంద్రబాబు సూచించారు. లేకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయా గ్రామాల వారికి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని వెల్లడించారు. అయితే పోలవరం నిర్వాసితులను భయపెట్టి కాకుండా వారి […]

Advertisement
Update:2015-12-09 02:52 IST

మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు వెంటనే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చంద్రబాబు సూచించారు. లేకుంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయా గ్రామాల వారికి సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని వెల్లడించారు. అయితే పోలవరం నిర్వాసితులను భయపెట్టి కాకుండా వారి సమస్యలను పరిష్కరించి ముందుకెళ్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేసేందుకు ఏడు గ్రామాల ప్రజలను తరలించాల్సి ఉందని అయితే కొన్ని గ్రామాల తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చంద్రబాబు చెప్పారు. 2018 నాటికి పోలవరం హెడ్‌వర్క్స్‌ పూర్తి చేస్తామని ప్రకటించారు. పట్టిసీమ పథకాన్ని 2016 మార్చి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలోనే కృష్ణా-పెన్నా అనుసంధానం చేయడంతో పాటు నాగావళి-వంశధార నదులు రెండింటిని అనుసంధానం చేస్తామని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News