మల్లాది విష్ణు అఫిడవిట్‌పై ఉప్పందించింది ఎవరు ?
విజయవాడ కృష్ణలంక కల్తీ మద్యం కేసు విజయవాడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెడకు చుట్టుకుంది. బార్ తనది కాదని తన బంధువులదని విష్ణు చెబుతూ వచ్చినా చివరకు ఆయనపైనా కేసు నమోదైంది. కేసులో ఏ9 నిందితుడిగా విష్ణును చేర్చారు. ఘటన జరిగిన తొలిరోజు బార్ తనది కాదని విష్ణు చెప్పడంతో పోలీసులు ఆచితూచీ వ్యవహరించారు. అయితే ఆయన ఎన్నికల అఫిడవిట్ చిక్కులు తెచ్చిపెట్టింది. బార్‌లో తనకు వాటా ఉన్నట్టు ఆస్తుల అఫిడవిట్‌లో స్వయంగా వెల్లడించిన విషయం […]
విజయవాడ కృష్ణలంక కల్తీ మద్యం కేసు విజయవాడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మెడకు చుట్టుకుంది. బార్ తనది కాదని తన బంధువులదని విష్ణు చెబుతూ వచ్చినా చివరకు ఆయనపైనా కేసు నమోదైంది. కేసులో ఏ9 నిందితుడిగా విష్ణును చేర్చారు. ఘటన జరిగిన తొలిరోజు బార్ తనది కాదని విష్ణు చెప్పడంతో పోలీసులు ఆచితూచీ వ్యవహరించారు. అయితే ఆయన ఎన్నికల అఫిడవిట్ చిక్కులు తెచ్చిపెట్టింది.
బార్‌లో తనకు వాటా ఉన్నట్టు ఆస్తుల అఫిడవిట్‌లో స్వయంగా వెల్లడించిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.బార్‌లో వాటా ఉన్నట్టు 2014 ఎన్నికల అఫిడవిట్‌లో విష్ణు చెప్పారంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఉప్పందించినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే పోలీసులు అఫిడవిట్‌ను తిరగేసి చూశారు. చివరకు అఫిడవిట్‌లో విష్ణు చెప్పిన విషయాన్ని పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేయగా… వారిలో ఐదుగురు మల్లాది విష్ణు కుటుంబసభ్యులే. మిగిలిన నలుగురు బార్ సిబ్బంది.