సముద్ర గర్భంలో 13 వేల కోట్ల నిధి

మానవ చరిత్రలో మరో అతిపెద్ద నిధి బయటపడింది. 300ఏళ్ల క్రితం నిధితో పాటు మునిగిపోయిన నౌక అచూకీ కొలంబియా వారు గుర్తించింది. మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిధి అని కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు. స్పెయిన్‌కు చెందిన శాన్‌జోస్ నౌక 1708లో కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. అందులో భారీగా బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులను ఐదో ఫిలిప్ రాజు వద్దకు తరలిస్తున్న ఈ సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ నిధి పాటు మునిగిన ఆ నౌక కోసం […]

Advertisement
Update:2015-12-07 07:04 IST

మానవ చరిత్రలో మరో అతిపెద్ద నిధి బయటపడింది. 300ఏళ్ల క్రితం నిధితో పాటు మునిగిపోయిన నౌక అచూకీ కొలంబియా వారు గుర్తించింది. మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద నిధి అని కొలంబియా అధ్యక్షుడు ప్రకటించారు.

స్పెయిన్‌కు చెందిన శాన్‌జోస్ నౌక 1708లో కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. అందులో భారీగా బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులను ఐదో ఫిలిప్ రాజు వద్దకు తరలిస్తున్న ఈ సమయంలో ఈ ఘటన జరిగింది.

భారీ నిధి పాటు మునిగిన ఆ నౌక కోసం వందల ఏళ్లుగా అన్వేషణ సాగుతోంది. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. నౌకలోని నిధి విలువ మన కరెన్సీలో 13 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నౌక అన్వేషణ కాలంలో అనేక ఇతర నౌకలను ఆచూకీని కనుగొన్నారు.

Tags:    
Advertisement

Similar News