పెదనాన్నకు చెప్పలేకపోతున్న ప్రభాస్
బాహుబలి-1 ఊహించని విజయం సాధించడంతో దేశంలోని సూపర్‌స్టార్లలో ఒకరిగా వెలుగుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సినిమా రెండో భాగం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వల్ల ప్రభాస్‌కు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. అయితే, బాహుబలి-2తోనే ముగియదని దీనికి కొనసాగింపుగా మరిన్ని చిత్రాలు వస్తాయని ఇటీవల ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి కోసం ప్రభాస్ రెండేళ్లుగా ఎలాంటి సినిమాలు చేయలేదు. మరో ఏడాదిన్నర దాకా డేట్లు ఖాళీ అయ్యే పరిస్థితి […]
Advertisement
బాహుబలి-1 ఊహించని విజయం సాధించడంతో దేశంలోని సూపర్‌స్టార్లలో ఒకరిగా వెలుగుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సినిమా రెండో భాగం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం వల్ల ప్రభాస్‌కు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. అయితే, బాహుబలి-2తోనే ముగియదని దీనికి కొనసాగింపుగా మరిన్ని చిత్రాలు వస్తాయని ఇటీవల ప్రకటించాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి కోసం ప్రభాస్ రెండేళ్లుగా ఎలాంటి సినిమాలు చేయలేదు. మరో ఏడాదిన్నర దాకా డేట్లు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బాహుబలి సీరిస్‌కు కొనసాగింపుగా మరిన్ని చిత్రాలు వస్తే.. ప్రభాస్ ఇతర సినిమాలు చేసేది అనుమానమే! అంతెందుకు బాహుబలి కారణంగా ప్రభాస్ వివాహం కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే! ప్రభాస్ క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే.. పెదనాన్న కృష్ణంరాజు సంతోషంగానే ఉన్నా.. మరోవైపు మనసులో బాధ పడుతున్నాడట.
కృష్ణంరాజు కల నెరవేరేనా?
ఎప్పటి నుంచో ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలన్నది కృష్ణంరాజు కల. బాహుబలి సినిమాకు ముందు పెదనాన్నతో కలిసి బిల్లా, రెబెల్ చిత్రాలు చేశాడు ప్రభాస్. అదే క్రమంలో పెదనాన్న దర్శకత్వంలోనూ సినిమా చేసేందుకు ప్రభాస్ సుముఖంగానే ఉండేవాడు. బాహుబలి సృష్టించిన ప్రభంజనం, ప్రభాస్ మార్కెట్ వాల్యూ అమాంతం అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోవడంతో ప్రభాస్- కృష్ణంరాజుల కాంబో సందిగ్ధంలో పడింది. ఓ వైపు యష్ రాజ్ చోప్రా వంటి పెద్ద బ్యానర్‌లో చేయాలంటూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక నుంచి ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం మల్టీ లింగ్వెల్ అవనుంది. దీంతో ప్రభాస్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్న కృష్ణం రాజు కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. ఇందుకు ప్రభాస్ బిజీ షెడ్యూల్ ఒక కారణమైతే.. కృష్ణం రాజు డైరెక్షన్ చేస్తే సినిమా ఫలితం ఎలా ఉంటుందోనన్న అనుమానం ప్రభాస్ మదిలో మొదలైందని సమాచారం. పెదనాన్న నిర్మాత అయితే ఒకే గానీ, దర్శకత్వం అంటే కష్టమేనని, ఈ విషయాన్ని నేరుగా చెప్పలేకపోతున్నాడట ప్రభాస్!
Advertisement