ఆ నేత అర్థరాత్రి ఆడవారికి ఫోన్ చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న రవీంద్రరాజుకు వ్యతిరేకంగా పార్టీకి చెందిన మరో వర్గం బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిందన్న అంశం చర్చనీయాంశమైంది. సాధారణ స్థాయిలో ఫిర్యాదు చేసి ఉంటే పెద్ద విషయం కాదు. అలా కాకుండా రవీంద్రరాజు పార్టీ మహిళా కార్యకర్తలకు నిత్యం అర్థరాత్రి పూట ఫోన్లు చేస్తున్నారంటూ ఆరోపించడమే విభేదాల తీవ్రతను తెలియజేస్తోంది. మహిళా కార్యకర్తలకు అర్థరాత్రి ఫోన్‌ చేసి ఎంతెంత సేపు మాట్లాడుతున్నారన్న సమాచారాన్ని కాల్‌డేటాతో సహా […]

Advertisement
Update:2015-12-07 08:43 IST

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్న రవీంద్రరాజుకు వ్యతిరేకంగా పార్టీకి చెందిన మరో వర్గం బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిందన్న అంశం చర్చనీయాంశమైంది. సాధారణ స్థాయిలో ఫిర్యాదు చేసి ఉంటే పెద్ద విషయం కాదు. అలా కాకుండా రవీంద్రరాజు పార్టీ మహిళా కార్యకర్తలకు నిత్యం అర్థరాత్రి పూట ఫోన్లు చేస్తున్నారంటూ ఆరోపించడమే విభేదాల తీవ్రతను తెలియజేస్తోంది. మహిళా కార్యకర్తలకు అర్థరాత్రి ఫోన్‌ చేసి ఎంతెంత సేపు మాట్లాడుతున్నారన్న సమాచారాన్ని కాల్‌డేటాతో సహా అధిష్టానానికి పంపారని చెబుతున్నారు. పైగా టీడీపీ అనుకూల మీడియా సంస్థ సదరు కాల్‌డేటా తమ వద్ద ఉందని ప్రకటించడంపైనా రవీంద్రరాజు వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల టీడీపీ విధానాలను పదేపదే తప్పుపడుతున్న సోమువీర్రాజును రవీంద్రరాజే ప్రోత్సహిస్తున్నారని బీజేపీలోని ఒక వర్గం భావన. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే ఆ వర్గం నేతలే రవీంద్రరాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదు పంపినట్టు భావిస్తున్నారు. కాల్‌డేటాను కూడా సంపాదించారంటే దీని వెనుక టీడీపీ ప్రభుత్వ అండ కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రవీంద్రరాజును దెబ్బకొట్టి ఇక్కడి నుంచి సాగనంపితే సోము వీర్రాజు ఇక ఏమీ చేయలేరని చంద్రబాబు అనుకూల బీజేపీ వర్గం భావిస్తోంది.

సోము వీర్రాజు పేరు ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉండడంతో కలవరపడ్డ టీడీపీ అనుకూల బీజేపీ వర్గం ఈ కొత్త ఎత్తు వేసిందని రవీంద్రరాజు వర్గీయులు అనుమానిస్తున్నారు. రవీంద్రరాజు, సోమువీర్రాజుతో ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు పడడం లేదని చెబుతున్నారు. సామాజికవర్గం కోణంలో హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాసులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని సోమువీర్రాజు వర్గం లోలోన మండిపడుతోంది. ఏదీఏమైనా వ్యక్తిగత కాల్‌డేటాను కూడా సంపాదించి అధిష్టానానికి పంపడం అంటే పరిస్థితి చాలా దూరం పోయిందనే అనుకోవాలి. ఇప్పుడు రవీంద్రరాజు వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News