వేలానికి మాల్యా విమానం

లిక్కర్ కింగ్ , కింగ్‌ ఫిషర్‌ యజమాని విజయమాల్యాకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గాల్లో తిరిగిన మాల్యా వ్యక్తిగత విమానం ఇప్పుడు వేలానికి రాబోతుంది. సర్వీస్ టాక్స్‌ వసూలు కోసం విజయ్‌మాల్యాకు చెందిన వ్యక్తిగత విమానాన్ని వేలం వేసేందుకు అనుమతివ్వాలని బొంబాయి హైకోర్టును సేవా పన్నుల శాఖ ఆశ్రయించింది. దీనిపై వాదనలు వినిపించాలని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కోర్టు ఆదేశించింది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే మార్చి 1న విమానాన్ని వేలం వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన […]

Advertisement
Update:2015-12-06 03:20 IST

లిక్కర్ కింగ్ , కింగ్‌ ఫిషర్‌ యజమాని విజయమాల్యాకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకప్పుడు గాల్లో తిరిగిన మాల్యా వ్యక్తిగత విమానం ఇప్పుడు వేలానికి రాబోతుంది. సర్వీస్ టాక్స్‌ వసూలు కోసం విజయ్‌మాల్యాకు చెందిన వ్యక్తిగత విమానాన్ని వేలం వేసేందుకు అనుమతివ్వాలని బొంబాయి హైకోర్టును సేవా పన్నుల శాఖ ఆశ్రయించింది. దీనిపై వాదనలు వినిపించాలని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను కోర్టు ఆదేశించింది.

ఒకవేళ కోర్టు అనుమతిస్తే మార్చి 1న విమానాన్ని వేలం వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విమానం ముంబాయి ఎయిర్‌పోర్టులో ఉంది. విజయ్‌ మాల్యా ఎంతో ముచ్చట పడి 2006లో ఈ విమానం కొనుగోలు చేశారు. తనకు ఇష్టమైన రీతిలో డెకరేషన్ చేయించుకున్నారు. 22 మంది ప్రయాణికులు ప్రయాణించగల ఈ విమానంలో బెడ్ రూమ్, డైనింగ్ హాల్, వాష్‌ రూమ్‌ వంటి సదుపాయాలున్నాయి. ఈ ఎయిర్‌బస్‌ ఏ 319 విమానం ఖరీదు 70 నుంచి 90 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

గత ఏడాది కూడా మాల్యాకు చెందిన ఒక విమానాన్ని బకాయి వసూలులో భాగంగా ముంబాయి ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు వారు విడిభాగాల కింద ఊడదీసి వేలమేశారు.

Tags:    
Advertisement

Similar News