బుగ్గ కనిపించడం లేదా?... పోలీసులపై జానా రుసరుస
తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు తన వాహనాన్ని ఆపడంతో జానారెడ్డి చిన్నబుచ్చుకున్నారు. ”కారుపై ఉన్న బుగ్గ కనిపంచడం లేదా … నన్నే ఆపడం ఎంతవరకు సమంజసం” అని ప్రశ్నించారు. అక్కడున్న పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ”మీ పేరేంటి” అని అక్కడున్న అధికారిని ప్రశ్నించారు. దీంతో వెంటనే పోలీసుల ” ప్లీజ్ వెళ్లండి సార్” అని కోరారు. అయితే జానారెడ్డి […]
తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డికి కోపం వచ్చింది. జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు తన వాహనాన్ని ఆపడంతో జానారెడ్డి చిన్నబుచ్చుకున్నారు. ”కారుపై ఉన్న బుగ్గ కనిపంచడం లేదా … నన్నే ఆపడం ఎంతవరకు సమంజసం” అని ప్రశ్నించారు. అక్కడున్న పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ”మీ పేరేంటి” అని అక్కడున్న అధికారిని ప్రశ్నించారు. దీంతో వెంటనే పోలీసుల ” ప్లీజ్ వెళ్లండి సార్” అని కోరారు. అయితే జానారెడ్డి మాత్రం … ఎలాగో ఆపారు కాబట్టి కారు డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీంతో టెస్ట్ చేసిన పోలీసులు డ్రైవర్ మద్యం సేవించలేదని నిర్ధారించుకుని పంపించివేశారు.