సోషల్‌ మీడియాలో అమ్మాయిల "హ్యాపీ టు బ్లీడ్" ఉద్యమం

సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలు గళమెత్తుతున్నారు. తమ శరీరంలో సహజంగా జరిగే మార్పులను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ”హ్యాపీ టు బ్లీడ్” ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమానికి అమ్మాయిలే కాదు మగవాళ్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ ఉద్యమం ఎందుకు మెదలైందంటే… ఇటీవల శబరిమలై ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశంపై ఆలయ ప్రధానాధికారి గోపాలకృష్ణన్‌ ఒక ప్రకటన చేశారు. మహిళలు రుతుస్రావంతో ఉన్నారా లేదా అన్నది కనిపెట్టే మిషన్లు అందుబాటులోకి వచ్చినప్పుడే వారిని ఆలయంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. అంతవరకు […]

Advertisement
Update:2015-12-05 09:32 IST

సోషల్ మీడియా వేదికగా అమ్మాయిలు గళమెత్తుతున్నారు. తమ శరీరంలో సహజంగా జరిగే మార్పులను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ”హ్యాపీ టు బ్లీడ్” ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమానికి అమ్మాయిలే కాదు మగవాళ్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ ఉద్యమం ఎందుకు మెదలైందంటే…

ఇటీవల శబరిమలై ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశంపై ఆలయ ప్రధానాధికారి గోపాలకృష్ణన్‌ ఒక ప్రకటన చేశారు. మహిళలు రుతుస్రావంతో ఉన్నారా లేదా అన్నది కనిపెట్టే మిషన్లు అందుబాటులోకి వచ్చినప్పుడే వారిని ఆలయంలోకి అనుమతిస్తామని ప్రకటించారు. అంతవరకు ఆడవాళ్లను ఆలయంలోకి అనుమతించబోమని చెప్పి కలకలం రేపారు. ఇప్పటికే ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశం నిషిద్ధం అయినప్పటికీ ఆలయ ప్రధానాధికారి వ్యాఖ్యలతో నవీనయువత గళమెత్తింది.

తొలుత పంజాబ్‌కు చెందిన నిఖితా అనే 20 ఏళ్ల యువతి ఆలయ ప్రధానాధికారి తీరును ప్రశ్నిస్తూ బయటకొచ్చారు. దీంతో మిగిలిన అమ్మాయిలు గొంతు కలిపారు. రుతుస్రావం అన్నది తమ చేతుల్లో లేని అంశం దాన్ని సాకుగా చూపి సమాజం నుంచి బహిష్కరించే అధికారం మీకెక్కడిది అని సోషల్‌ మీడియాలో నిలదీస్తున్నారు. ”హ్యాపీ టు బ్లీడ్” అని రాసిన ప్లకార్డులతో ఫోటోలు దిగి పోస్ట్ చేస్తున్నారు. అసలు మహిళలకు రుతుస్రావం అన్నది లేకుంటే మనిషి పుట్టక సాధ్యమా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవం తెలిసిన ప్రతి ఒక్కరూ వీరి వాదనను సమర్ధిస్తున్నారు. మన దేశంలో అమ్మాయిలు మొదలుపెట్టిన హ్యాపీ టు బ్లీడ్ ఉద్యమంపై బీబీసీ చానల్ కూడా ప్రత్యేక కథనం ప్రసారం చేసింది.

Tags:    
Advertisement

Similar News