అడిగాను... తప్పేంటి?
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు సానియా మీర్జా గొంతెమ్మ కోర్కెలు కోరారంటూ ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి విమర్శించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. అవును… ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిందిగా అడిగిన మాట వాస్తవమేనని చెప్పారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. భోపాల్‌లో ఈవెంట్ జరగాల్సిన మరుసటి రోజే గోవాలోనూ తాను మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని అందుకే బిజీ షెడ్యుల్ కారణంగా ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరామని ఆమె […]
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన క్రీడా అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యేందుకు సానియా మీర్జా గొంతెమ్మ కోర్కెలు కోరారంటూ ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి విమర్శించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. అవును… ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ఏర్పాటు చేయాల్సిందిగా అడిగిన మాట వాస్తవమేనని చెప్పారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు.
భోపాల్‌లో ఈవెంట్ జరగాల్సిన మరుసటి రోజే గోవాలోనూ తాను మరో కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని అందుకే బిజీ షెడ్యుల్ కారణంగా ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరామని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. భోపాల్ నుంచి గోవాకు కమర్షియల్ ఫ్లైట్ లో వెళ్తే ఏడు గంటల సమయం పడుతుందని అందుకే ప్రత్యేక విమానాన్ని సమకూర్చాలని కోరామని వెల్లడించారు. సానియా తరపున ఆమె మేనేజింగ్ ఏజెన్సీ ఈ ప్రకటన జారీ చేసింది. ఈవెంట్‌కు హాజరయ్యేందుకు రూ. 5లక్షలు డిమాండ్ చేశారన్న వ్యాఖ్యలను ఆమె ఖండించారు.
భోపాల్‌లో గత నెల 28న జరగాల్సిన క్రీడా అవార్డు ప్రదానోత్సవానికి సానియాను ఆహ్వానించగా ఆమె ప్రత్యేక విమానం, రూ. 75 వేల విలువైన మేకప్ కిట్ అడిగారని మధ్య ప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి వెల్లడించడంలో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సానియా వివరణ ఇచ్చారు. సానియా కోరికలు తీర్చడం తమ వల్ల కాదంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం పుల్లెల గోపిచంద్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి కార్యక్రమం నిర్వహించింది.
Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!