వలస వ్యతిరేకతకు బాబు విరుగుడు నెంబర్ 225!

ఇటీవల ఏపీలో టీడీపీలోకి వలసలను చంద్రబాబు బాగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపోవడంతో ఖాళీగా తిరుగుతున్న ఆ పార్టీ నేతలకు రెడ్‌ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరుజిల్లాల్లో ఈ వలసలను ఎక్కువగా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఆ కోటాలోనే తాజాగా ఆనం బ్రదర్స్‌ను కూడా పార్టీలోకి లాగేస్తున్నారు. వీలైతే సీమ జిల్లాల్లో అంతోఇంతో పేరున్న కాంగ్రెస్ నేతలందరినీ సైకిల్ ఎక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రాయలసీమలో బలంగా ఉన్న వైసీపీని బలహీనపరచవచ్చన్నది […]

Advertisement
Update:2015-11-30 23:55 IST

ఇటీవల ఏపీలో టీడీపీలోకి వలసలను చంద్రబాబు బాగా ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపోవడంతో ఖాళీగా తిరుగుతున్న ఆ పార్టీ నేతలకు రెడ్‌ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరుజిల్లాల్లో ఈ వలసలను ఎక్కువగా చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. ఆ కోటాలోనే తాజాగా ఆనం బ్రదర్స్‌ను కూడా పార్టీలోకి లాగేస్తున్నారు. వీలైతే సీమ జిల్లాల్లో అంతోఇంతో పేరున్న కాంగ్రెస్ నేతలందరినీ సైకిల్ ఎక్కించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రాయలసీమలో బలంగా ఉన్న వైసీపీని బలహీనపరచవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే…

పదేళ్లపాటు కాంగ్రెస్‌పై పోరాటం చేసిన స్థానిక టీడీపీ నేతలు ఈ వలసలను ఎలా అంగీకరిస్తున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఆనం లాంటి నేతలు పార్టీలోకి వస్తే భవిష్యత్తులో తమ టికెట్లకు ఎసరొస్తుందని తెలిసి కూడా టీడీపీ స్థానిక నేతలు ఎలా మౌనంగా ఉంటున్నారన్న దానిపై నేతలు ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారికి పార్టీ సీనియర్ల నుంచి ఆసక్తికరమైన సమాధానం వచ్చింది.

Click to Read: ప్రకాశం జిల్లా వదిలిపెట్టని చంద్రబాబు

కాంగ్రెస్‌ నుంచి వలసలను వ్యతిరేకిస్తున్న నేతల దగ్గర 225 నెంబర్‌ను చంద్రబాబు పఠిస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు డిలిమిటేషన్ జరిగి 175 నుంచి 225కు పెరుగుతాయని సొంతపార్టీ నేతలతో చంద్రబాబు చెబుతున్నారు. డిలిమిటేషన్‌లో స్థానాలు పెరిగితే మరో 50 అసెంబ్లీ స్థానాలు వచ్చి చేరుతాయని… కొత్తగా పార్టీలో చేరే వారికి ఆ సీట్లలో సర్ధుబాబు చేస్తామని ఒప్పిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతల స్థానాలకు వచ్చిన ముప్పేమి లేదని చంద్రబాబు హామీ ఇస్తున్నారని నేతలు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News