ప్రకాశం జిల్లా వదిలిపెట్టని చంద్రబాబు

తమ ప్రాంతాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ వైపు రాయలసీమవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఆ జాబితాలోకి ప్రకాశం జిల్లా కూడా వచ్చి చేరుతోంది. జిల్లాకు కొత్తగా ప్రాజెక్టులు, అభివృద్ది పనుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పక్క జిల్లాలకు తరలిస్తుండడంపై జిల్లావాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లావాసులకు తాజాగా కోపం రావడానికి కారణం మైనింగ్‌ యూనివర్శిటీ. ఏప్రిల్‌లో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా […]

Advertisement
Update:2015-11-30 23:58 IST

తమ ప్రాంతాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ వైపు రాయలసీమవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఆ జాబితాలోకి ప్రకాశం జిల్లా కూడా వచ్చి చేరుతోంది. జిల్లాకు కొత్తగా ప్రాజెక్టులు, అభివృద్ది పనుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పక్క జిల్లాలకు తరలిస్తుండడంపై జిల్లావాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లావాసులకు తాజాగా కోపం రావడానికి కారణం మైనింగ్‌ యూనివర్శిటీ.

ఏప్రిల్‌లో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన వెనుకబడిన చీమకుర్తి ప్రాంతంలో మైనింగ్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో గ్రానైట్‌తో పాటు అనేక రకాల ఖనిజాలు ఉండడంతో మైనింగ్ యూనివర్శిటీకి సరైన ప్రాంతాన్నే చంద్రబాబు ఎంపిక చేశారని అందరూ భావించారు. అయితే ఇప్పుడా యూనివర్శిటీని కృష్ణా జిల్లాకు తరలించారు. కృష్ణా జిల్లాలో మైనింగ్‌ యూనివర్శిటీ కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఇదే ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

Click to Read: వలస వ్యతిరేకతకు బాబు విరుగుడు నెంబర్ 225!

తాము అడక్కుండానే మైనింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఆశచూపి ఇప్పుడు తీరా దాన్ని తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లాకు చెందిన టీడీపీ నేతలు గానీ, మంత్రులు గానీ నోరు మెదకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటీవల కేంద్రం ప్రకటించిన లక్షా 98వేల ఇళ్లలోనూ ప్రకాశం జిల్లాకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన వ్యక్తమవుతోంది. లక్షా 98 వేల ఇళ్లలో ప్రకాశం జిల్లాకు కేవలం 5వేల ఇళ్ళు మాత్రమే ప్రకటించారని ఆరోపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News