బిజెపీకి 'బాబు' భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎందుకింత నిర్లక్ష్యం చేస్తోంది? ప్రత్యేకహోదా విషయం నుంచి,అమరావతి ప్యాకేజీ వరకూ ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోంది?ఇటీవల సంభవించిన భారీ వర్షాల కు పక్కనే ఉన్న తమిళనాడుకుచేసినంత సహాయం కూడా చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం-బిజెపిలు ఎందుకంత బద్ద శత్రువులుగా మారాయి? ఇవే ప్రశ్నలు అందరిలోనూ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయప్రయోజనాలే ఎక్కువగా ఉభయపార్టీలూ భావించడమే దీనికి ప్రధానకారణంగా పేర్కొంటున్నారు.బిజెపి కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగే […]

Advertisement
Update:2015-11-30 07:39 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎందుకింత నిర్లక్ష్యం చేస్తోంది? ప్రత్యేకహోదా విషయం నుంచి,అమరావతి ప్యాకేజీ వరకూ ఎందుకు పట్టనట్లు వ్యవహరిస్తోంది?ఇటీవల సంభవించిన భారీ వర్షాల కు పక్కనే ఉన్న తమిళనాడుకుచేసినంత సహాయం కూడా చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం-బిజెపిలు ఎందుకంత బద్ద శత్రువులుగా మారాయి? ఇవే ప్రశ్నలు అందరిలోనూ వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలకంటే రాజకీయప్రయోజనాలే ఎక్కువగా ఉభయపార్టీలూ భావించడమే దీనికి ప్రధానకారణంగా పేర్కొంటున్నారు.బిజెపి కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు రాష్ట్రంలో దీర్ఘకాలం అధికారంలో ఉండాలనే తపనతో ముందుకు వెళుతున్నారు.ఆంధ్రాలోనూ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో బిజెపి ఉంటే, దీనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగావ్యవహరిస్తున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్యా తీవ్రవైరుధ్యాలు నెలకొంటున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరంభంలో ఎంతో కొంత సర్దుకుపోదామని ఇరుపార్టీలు ఆశించినా, సాధ్యం కాలేదు. ఎవరికి వారు కొత్త రాష్ట్రం,ఇప్పటి నుంచి ఇక్కడ ప్రజల అవసరాలు,ఆశల్ని నెరవేరిస్తే రాబోయే రోజుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవచ్చనే రాజకీయ తపనతోనే వ్యవహరిస్తున్నారు. రెండు పార్టీలు కూడా ఇదే విధంగా వ్యవహరించడం వల్ల పొసగడం లేదు. ఫలితంగానే అటు బిజెపి,ఇటు టిడీపీల మధ్య తీవ్రమైన దూరం పెరిగింది. అందుకే ఇరుపార్టీల్లోని మంత్రులు,ఎంపీలు,సీనియర్‌ నేతలు సైతం నేరుగా ఘర్షణకు,విమర్శలకు పాల్పడ్డారు.ఈ విభేదాలు ఇంకా పెరిగేవే తప్ప తగ్గేవి ఏమాత్రం కావు.

Click to Read: అనురాధ హత్య కేసు- బయటకొచ్చిన చింటూ

బిజెపి ధీమా ఏమిటి?
బిజెపి అనుకున్న దానికంటే దేశ స్థాయిలో బలంగా ఉందని ఆపార్టీనేతల అభిప్రాయం. ప్రధాని మోడిప్రభావం ఇప్పట్లో ఏమాత్రం తగ్గదని,ఆయన పేరుచెబితే దేశ,విదేశాల్లోసైతం ప్రభావితం అయ్యే పరిస్థితులు ఉన్నాయనేది పార్టీవర్గాల ధీమా. ఇలాంటి పరిస్థితుల్లోప్రాంతీయ పార్టీలకంటే ఎక్కువగా ఆయారాష్ట్రాల్లో బలపడదామనే యోచన చేసింది. రాజకీయ ప్రాధాన్యమైన ఆంధ్రాలో మాత్రం ఈవిషయంలో సాధ్యంకాదనే భావనకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ చతురత ముందు బిజెపి ముందుకు వెళ్లలేదని అర్థం అయింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సైతం ఈవిషయంలో వెనక్కి తగ్గినట్లేకన్పిస్తున్నారు. ఎన్నికలకు ముందు,కేంద్రంలో అధికారంలోకి వచ్చినతర్వాత వెంకయ్యనాయుడు కోస్తా ఆంధ్రాలోని చౌదరి కులస్తుల్ని ఏకం చేసే ప్రయత్నాలుచేశారు. దశలవారీగా సమావేశాలు నిర్వహించారు. వారికి కావాల్సిన అన్ని రకాల మంచి చెడులకు హాజరవుతున్నారు. కేంద్రం నుంచి అందే సహాయ,సహకారాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. రాజకీయంగా,ఆర్థికంగా ఆంధ్రాలో అత్యంత ప్రభావంచూసే కమ్మ నాయకత్వం ఇపుడు చంద్రబాబు కంటే కూడా వెంకయ్యమీదే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇపుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏరకంగానూ ఇక్కడున్న కమ్మవారికి ఆర్థికంగా సహాయపడే స్థితిలో లేరు. కేంద్రం మాత్రమే వారి ఆర్థిక అవసరాలను తీర్చేలా ఉంది. దీన్ని ముందుగానే ఆంధ్రా కమ్మమహాజన సంఘం గుర్తించింది.దీంతోచంద్రబాబును కాదని, వెంకయ్య బాట పట్టింది.అలా అని చంద్రబాబును పూర్తిగాదూరం చేసుకోలేదు. ఎక్కడి ప్రయోజనాలుఅక్కడ అన్నట్లుగా ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరు నాయుడులను కలిపే ప్రయత్నాలనూ కొందరు పెద్దకమ్మవారు చేశారు. కానీ మధ్యలో మోడీ ఉండటంతో వీరి కలయిక సాధ్యం కాలేదు.

రాష్ట్రంలో బిజెపికి ముందున్నంత ఆసక్తి లేదని తెలుస్తోంది. అందుకే ఆంధ్రా అవసరాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి సహాయ,సహకారాలు లేకుండా ఇప్పట్లో చంద్రబాబు కూడా రాష్ట్రాన్ని ఎలాంటి అంశంలోనూ ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు.ఈ విషయం ఇరు వర్గాలకూ తెలుసు. ఇటీవల జరిగిన వేర్వేరు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి ఎదురయిన చేదు అనుభవా దృష్ట్యా రాష్ట్రంలోనిఎంపీల అవసరం బిజెపికి ఉంది. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీని దూరంచేసుకునే సాహసం నరేంద్రమోడీచేయరనే ధీమా చంద్రబాబులో ఉంది. అయితే అమరావతి నగర నిర్మాణం కేంద్రం అనేది కేంద్రం సహాయ సహకారాలు అందిస్తేనే సాధ్యమయ్యే అంశం. ఎవరికి వారు బింకంగా ఉన్నారు.రాష్ట్ర అవసరాల దృష్ట్యా వెనక్కి తగ్గేలా లేరు. ఇపుడున్న పరిస్థితుల్లో కేంద్రం మాత్రం చంద్రబాబుకు సహకరించేలా లేదు.

Click to Read: Bala Krishna gives warning to his colleague?

చంద్రబాబు వ్యూహం ఏమిటి?
దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా అమరావతిని తీర్చిదిద్దుతానిని ప్రకటించినచంద్రబాబు కేంద్రం నుంచి నిత్యం అవమానాలు,ఆందోళనలనే ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ బిజెపి ప్రభుత్వం రాష్ట్రాభివృద్దికి సహకారం అందించిన విధానంచూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ప్రత్యేక హోదా,ప్యాకేజీ,వరద సహాయం వంటి అన్ని అంశాల్లోనూ కేంద్రం ప్రదర్శించే వివక్షపై చంద్రబాబు బిజెపిపై తీవ్ర స్థాయిలోనూ అసహనంగా ఉన్నారు. కానీ ఆవిషయాన్నిప్రదర్శించే సాహసం చేయలేకపోతున్నారు.”ఇంకా మూడున్నరేళ్ల పాటు అధికారంలో ఉండాలి. కేంద్రంతో తగాదా పెట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదు. ఏదోలా బతిమిలాడి ఇచ్చిన వరకూ కేంద్రం నుంచి తెచ్చుకుందామనే ధోరణిలో బాబు ఉన్నారు. ఆర్థిక అవసరాలే కాకుండా, వివిధ దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం నుంచి అనుమతులు కావాలి. అవి రాకపోతే ఆయా దేశాలు మన రాష్ట్రం వైపు కన్నెత్తి కూడాచూడవు. అందుకే ముఖ్యమంత్రి ఆచితూచి వ్యవహరిస్తున్నారు” అని పార్టీలో కీలకమైన నేత ఒకరువ్యాఖ్యానించారు.

ఒకవైపు ప్రత్యేకహోదా విషయంలో బిజెపి రాష్ట్రాన్ని మాయచేసి మోసంచేసిందనే భావన తెలుగుదేశం నాయకత్వంలోనూ ఉంది. మరో వైపు ప్యాకేజీ విషయంలోనూ ఎలాంటి హామీ ఇవ్వడంలేదు. ఇలాంటి వాతావరణంలో రాష్ట్రాభివృద్ది అనేది ఎలా సాధ్యం? తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగింపు ఏవిధంగా అమలవుతుందనే ఆందోళన చంద్రబాబులో ఉంది. కానీ ఇపుడు కేంద్రంతో ఘర్షణ పడి సాధించేది ఏమీలేదనే విషయం ఆయనకు పూర్తిగా తెలుసు. అందుకే పన్నెత్తి మాట అనకుండా పనిచేసుకు పోతున్నారు.వాస్తవానికి అమరావతి శంకుస్థాపనకువచ్చిన ప్రధాని నరేంద్రమోడి మట్టి,నీరు మాత్రమే ఇచ్చి ఎలాంటి ప్రకటన చేయకుండా వెనుదిరిగి వెళ్లిన రోజునే చంద్రబాబు అడ్డం తిరగాలి. అందరినీకలుపుకొని కేంద్రంపై వత్తిడితేవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలక ంటే,రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే భావనలో చంద్రబాబు ఉండటంతో కేంద్రంపై ఎలాంటి వ్యతిరేకప్రకటనా చేయలేకపోతున్నారు.

చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడిచాయి. ఇప్పటి వరకూ చేసింది ఏమీ లేదనేది ఆయనకూ తెలుసు. మీడియాలో ప్రకటనలు తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఇలాగే కాలక్షేపం చేస్తే పరిస్థితులు తిరగబడతాయి. రాష్ట్ర ప్రజలు ఇప్పటికేచాలా సహనంతో వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆలోచన లేని విధంగా భావిస్తే భారీ మూల్యాన్నేచెల్లించుకోవాల్సివస్తుంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలని,అధికారాన్ని వారసత్వంగా అందివ్వాలని ఆశించే చంద్రబాబు ఈవిషయంలో ఎంత త్వరగా మేల్కంటేఅంతగా ఆయనకే మంచిది.

-సిద్ధార్ద రాయ్‌

Tags:    
Advertisement

Similar News