బిజేపి మెప్పుకోసం రాజీవ్ పై చిదంబరం అసహనం

దేశంలో అసహనంపై బీజేపీని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు తెచ్చిపెట్టారు చిదంబరం. ఢిల్లీలో టైమ్స్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం… సల్మాన్ రష్దీ రచించిన సాటానిక్ వెర్సెస్ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనని అంగీకరించారు. రాజీవ్ గాంధీ హయాంలో చిదంబరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అప్పట్లో సల్మాన్ రష్దీ రచించిన సాటానిక్ వెర్సెస్ బుక్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని 1989లో నిషేధించింది. పుస్తకాన్ని […]

Advertisement
Update:2015-11-30 05:07 IST

దేశంలో అసహనంపై బీజేపీని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కు తెచ్చిపెట్టారు చిదంబరం. ఢిల్లీలో టైమ్స్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం… సల్మాన్ రష్దీ రచించిన సాటానిక్ వెర్సెస్ పుస్తకాన్ని నిషేధించడం తప్పేనని అంగీకరించారు. రాజీవ్ గాంధీ హయాంలో చిదంబరం కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. అప్పట్లో సల్మాన్ రష్దీ రచించిన సాటానిక్ వెర్సెస్ బుక్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని 1989లో నిషేధించింది.

పుస్తకాన్ని నిషేధించడం ఆనాడు రాజీవ్‌ గాంధీ నేతృత్వంలో తాము చేసిన తప్పిదమని చిదంబరం వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీని విధించి తప్పుచేసిన విషయాన్ని కూడా అంగీకరించారు. అధికారంలో ఉన్నపుడు చేసిన తప్పులన్నీ.. పవర్ కోల్పోయాక మాత్రమే గుర్తొస్తాయని కూడా చిదంబరం అంగీకరించారు. అంతేగాదు మోడీ ప్రభుత్వ హయాంలో అసహనం పెరిగిపోతోందని చిదంబరం ఆరోపించారు. ఖాప్‌ పంచాయితీ పెద్దలు ధైర్యంగా తమకు ఇష్టం వచ్చిన ఆదేశాలను జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన పుస్తకంపై నిషేధం తప్పని చిదంబరం ఒప్పుకోవడంపై రచయిత సల్మాన్‌ రష్దీ స్పందించారు. తప్పు తెలుసుకోవడానికే 27 ఏళ్లు పట్టిందని.. దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందోనని వ్యాఖ్యానించారు. మరోవైపు సరిగ్గా పార్లమెంట్ శీతాకాల సమావేశాల టైమ్ లో చిదంబరం చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మరింత బలాన్నిస్తాయంటున్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ అసహనం అంశాన్ని లేవనెత్తితే..ఇప్పుడు కమలనాథులు చిదంబరం వ్యాఖ్యలను ప్రస్తావించి ఇరుకున పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి చిదంబరం ద్వారా బీజేపీకి మరో అస్త్రం అందించినట్టైంది.

చిదంబరం వ్యాఖ్యలపై కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలకు అందరూ బాధ్యత వహించాలని ఇప్పుడు ఆ తప్పును రాజీవ్ మీదకి నెట్టడం సరికాదని అన్నారు. చిదంబరం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడిపి లాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండి వాళ్ళ ప్రయోజనాలు కాపాడేవారని, ఇప్పుడు అధికారం పోయినప్పుడు తన ప్రయోజనాలు వాళ్ళు కాపాడేలాగా చక్కగా ప్లాన్ చేసుకోగల సమర్ధుడని విమర్శిస్తున్నారు. శశిధరూర్ లాగా బిజేపితో మంచిగాఉండేందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News