కొత్త చానల్‌ పెట్టే యోచనలో ఏపీ

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కొత్తగా ఒక టీవీ చానల్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరహాలో “శైవం” ప్రచారం కోసం భక్తి చానల్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే చానల్‌ ప్రారంభం కోసం అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేశారు. ప్రస్తుతం ఎస్వీబీసీ  వద్ద ఉన్న పరికరాలతోనే కొత్త చానల్ నడపనున్నారు. కొత్త చానల్‌ నడిపేందుకు సరిపడ పరికరాలు ఎస్వీబీసీ  వద్ద అదనంగా ఉన్నాయి. దీంతో శైవం ప్రచారం కోసం చానల్‌ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అంతా […]

Advertisement
Update:2015-11-30 01:57 IST

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కొత్తగా ఒక టీవీ చానల్ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరహాలో “శైవం” ప్రచారం కోసం భక్తి చానల్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇప్పటికే చానల్‌ ప్రారంభం కోసం అనుమతి కోరుతూ దరఖాస్తు కూడా చేశారు. ప్రస్తుతం ఎస్వీబీసీ వద్ద ఉన్న పరికరాలతోనే కొత్త చానల్ నడపనున్నారు.

కొత్త చానల్‌ నడిపేందుకు సరిపడ పరికరాలు ఎస్వీబీసీ వద్ద అదనంగా ఉన్నాయి. దీంతో శైవం ప్రచారం కోసం చానల్‌ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అంతా అనుకున్నట్టు జరిగితే మరో ఏడాదిలో “శైవం” చానల్‌ ఎయిర్‌లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కొత్త చానల్ ద్వారా శ్రీశైలం, కోటప్పకొండ, దాక్షారామం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ శైవక్షేత్రాలకు సంబంధించిన విశేషాలు, కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. శ్రీశైలం టెంపుల్‌ను కూడా తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని ఏపీ దేవాదాయశాఖ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News