ఆనం బ్రదర్స్‌పై తముళ్ల "ఫ్యాక్స్‌" పోరాటం

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్‌ టీడీపీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినప్పటికీ… వారి రాకను అడ్డుకునేందుకు నెల్లూరు తెలుగు తమ్ముళ్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఫిర్యాదు పంపడం మొదలుపెట్టారు. అయితే అధినాయకత్వానికి నేరుగా కాకుండా పార్టీ ఆఫీస్‌కు ఈ -మెయిల్స్‌, ఫ్యాక్సులు పంపుతున్నారు. ”ఆనం బ్రదర్స్ వస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. ఆనం సోదరులు పార్టీలోకి రావడం మాకు నచ్చడం లేదు. నిన్నటి వరకు పార్టీని, అధినేతను […]

Advertisement
Update:2015-11-29 11:24 IST

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్‌ టీడీపీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినప్పటికీ… వారి రాకను అడ్డుకునేందుకు నెల్లూరు తెలుగు తమ్ముళ్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఫిర్యాదు పంపడం మొదలుపెట్టారు. అయితే అధినాయకత్వానికి నేరుగా కాకుండా పార్టీ ఆఫీస్‌కు ఈ -మెయిల్స్‌, ఫ్యాక్సులు పంపుతున్నారు. ”ఆనం బ్రదర్స్ వస్తే పార్టీకి లాభం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. ఆనం సోదరులు పార్టీలోకి రావడం మాకు నచ్చడం లేదు. నిన్నటి వరకు పార్టీని, అధినేతను తిట్టిన వారిని ఎలా చేర్చుకుంటారు” అంటూ రకరకాల ప్రశ్నలతో ఈ- మెయిల్స్‌, ఫ్యాక్సులు వస్తున్నాయి.

Also Read ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని తిట్టారంటే!

అయితే మెయిల్స్‌, ఫ్యాక్స్‌ల వెనుక నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఆనం సోదరులు పార్టీలోకి రావడం జిల్లాలో చాలా మంది నేతలకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతున్నారు. పదేళ్లపాటు టీడీపీ శ్రేణులను వేధించి అధికారాన్ని అనుభవించిన ఆనం సోదరులు ఇప్పుడు అధికారం కోసం టీడీపీ పంచన చేరుతున్నారని టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. వారే కార్యకర్తల చేత ఆనం సోదరులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు పంపిస్తున్నారని అనుమానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News