చింతమనేని పెళ్లి కూడా వివాదాస్పదమేనా?

”గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ అంగన్‌వాడీ మహిళలను దూషించిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై మహిళా, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చింతమనేని తీరును నిరసిస్తూ ఏలూరులో ప్రజాసంఘాలు రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించాయి. సమావేశానికి మహిళా, కార్మిక, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు చింతమనేనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని చరిత్ర మొత్తం రౌడీయిజంతో ముడిపడి ఉందని మండిపడ్డారు. తొలి నుంచి చింతమనేని  తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ […]

Advertisement
Update:2015-11-29 09:48 IST

”గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ అంగన్‌వాడీ మహిళలను దూషించిన టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై మహిళా, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చింతమనేని తీరును నిరసిస్తూ ఏలూరులో ప్రజాసంఘాలు రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించాయి. సమావేశానికి మహిళా, కార్మిక, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు చింతమనేనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

చింతమనేని చరిత్ర మొత్తం రౌడీయిజంతో ముడిపడి ఉందని మండిపడ్డారు. తొలి నుంచి చింతమనేని తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ వచ్చారని ఆరోపించారు. చివరకు మహిళను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి వివాహం చేసుకున్న ఘనత కూడా చింతమనేనిదేనని ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు.

CLICK TO READ- సంకట స్థితిలో కొణతాల రామకృష్ణ

ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వ విప్‌గా చంద్రబాబు ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే చింతమనేనిని అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారిత గురించి ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి వెంటనే చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News