గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు- మహిళలపై చింతమనేని బూతులు

తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినా, అటవీ సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యంగా రోడ్డు వేసినా తనను ఏ వ్యవస్థ ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వ విప్, టీడీపీ  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో ధీమా బాగా పెరిగినట్టుంది. ఈసారి చింతమనేని తీరుకు అంగన్‌వాడీ మహిళలు బలయ్యారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదు.. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయండంటూ విన్నవించుకునేందుకు వచ్చిన అంగన్‌వాడీ మహిళలను చింతమనేని బూతులు తిట్టారు. Click to Read: ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని […]

Advertisement
Update:2015-11-27 21:54 IST

తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినా, అటవీ సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యంగా రోడ్డు వేసినా తనను ఏ వ్యవస్థ ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో ధీమా బాగా పెరిగినట్టుంది. ఈసారి చింతమనేని తీరుకు అంగన్‌వాడీ మహిళలు బలయ్యారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదు.. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయండంటూ విన్నవించుకునేందుకు వచ్చిన అంగన్‌వాడీ మహిళలను చింతమనేని బూతులు తిట్టారు.

Click to Read: ఆనం బ్రదర్స్ చంద్రబాబును ఏమని తిట్టారంటే!

నోటికొచ్చినట్టు, బయటకు చెప్పుకోలేని స్థాయిలో బూతులు తిట్టారు. ”కోడి గుడ్లు, పప్పులు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ అనకూడని మాటలు అనేశారు. ”మా జీతాలకు దిక్కులేదు. చంద్రబాబే అద్దెఇంటిలో ఉంటున్నారు. మీకు వస్తున్నవి సరిపోవడం లేదని జీతాలు కూడా కావాలా.? కావాలంటే బెడ్‌రూం ఇస్తాం తీసుకోండి” అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే బూతులతో బిత్తరపోయిన మహిళల నోట మాట రాలేదు. ఇంతలో ఓ పెద్దావిడ జోక్యం చేసుకుని తాము అడుగుతున్నది పెంచిన జీతాలు కాదని… పాత జీతాలే మూడు నెలలుగా రాలేదని చింతమనేనికి వివరించబోయారు. అయితే ఆ పెద్దావిడను కూడా చింతమనేని బూతులు తిట్టారు.

ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్న చింతమనేని తీరుతో హడలిపోయిన మహిళలు చేసేదేమీ లేక… ఎందుకొచ్చామురా దేవుడా అంటూ వెనుదిరిగారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఎమ్మెల్యే ఇలా రెచ్చిపోయేవారు కాదని మహిళలు మండిపడుతున్నారు.

Click to Read: 15-year-old gang-raped, aunt received video on WhatsApp

Tags:    
Advertisement

Similar News