చంద్రన్న కానుకపై స్టార్ హోటల్‌లో మాటువేసిన రింగ్ బ్యాచ్..?
చంద్రబాబు ప్రేమగా ప్రకటించిన సంక్రాంతి కానుకను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. వచ్చే సంక్రాంతి కానుకకు సుమారు నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతుండగా… అందులో మెజారిటీ మొత్తాన్ని తమ బొజ్జలో వేసుకునేందుకు కొందరు బడాబాబులు రింగ్ అయ్యారు. వారంతా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో సమావేశం అయినట్టు సమాచారం. మ్యాటర్ పక్కా నడిపించేందుకు అక్రమార్కులు 70 ల్యాప్‌ట్యాపులను నుంచి ఒకేసారి ఈ- టెండర్ వేసేందుకు ప్లాన్ చేశారు. వ్యాపారులంతా ఇలా రింగ్ అవడం […]
చంద్రబాబు ప్రేమగా ప్రకటించిన సంక్రాంతి కానుకను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. వచ్చే సంక్రాంతి కానుకకు సుమారు నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతుండగా… అందులో మెజారిటీ మొత్తాన్ని తమ బొజ్జలో వేసుకునేందుకు కొందరు బడాబాబులు రింగ్ అయ్యారు. వారంతా హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో సమావేశం అయినట్టు సమాచారం. మ్యాటర్ పక్కా నడిపించేందుకు అక్రమార్కులు 70 ల్యాప్‌ట్యాపులను నుంచి ఒకేసారి ఈ- టెండర్ వేసేందుకు ప్లాన్ చేశారు. వ్యాపారులంతా ఇలా రింగ్ అవడం వెనుక మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం.
చంద్రన్న కానుక ద్వారా ఆరు వస్తువులను ప్రజలకు పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సిండికేట్ వెనుక సీఎం పేషీలోని వ్యక్తుల హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపారులంతా సిండికేట్ అవడం ద్వారా చంద్రన్న కానుకకు సంబంధించిన ఆరు వస్తువులను భారీ రేటుకు కోడ్ చేసి ప్రజాధనాన్ని భారీగా కొల్లగొట్టాలని చూస్తున్నారు. చంద్రన్న కానుక టెండర్‌లో సిండికేట్‌పై ఓ ప్రముఖ పత్రిక కూడా కథనాన్ని ప్రచురించింది.