అమ్మో..! శ్రీనువైట్లా?
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు గానీ, ఒక్క సినిమా ఫ్లాప్ ఇండస్ట్రీలో దర్శకుల భవిష్యత్తును మాత్రం నిర్ణయిస్తుంది. సినిమా హిట్ అయితే పెద్ద హీరోలు సైతం డేట్లు అడ్జస్ట్ చేస్తామంటూ ముందుకు వస్తారు. ఒక్క ఫ్లాప్ పడితే.. డేట్లు ఖాళీ లేవని మొహం మీదనే చెప్పి తప్పించుకుంటారు. ఈ విషయం దర్శకుడు శ్రీనువైట్ల విషయంలో అక్షరాల నిజమవుతోంది. ఆగడు డిజాస్టర్ తరువాత హీరోలంతా శ్రీనువైట్లతో సినిమా చేసే విషయంలో కొంతకాలం పాటు ఆలోచించారు. జూనియర్, […]
Advertisement
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు గానీ, ఒక్క సినిమా ఫ్లాప్ ఇండస్ట్రీలో దర్శకుల భవిష్యత్తును మాత్రం నిర్ణయిస్తుంది. సినిమా హిట్ అయితే పెద్ద హీరోలు సైతం డేట్లు అడ్జస్ట్ చేస్తామంటూ ముందుకు వస్తారు. ఒక్క ఫ్లాప్ పడితే.. డేట్లు ఖాళీ లేవని మొహం మీదనే చెప్పి తప్పించుకుంటారు. ఈ విషయం దర్శకుడు శ్రీనువైట్ల విషయంలో అక్షరాల నిజమవుతోంది. ఆగడు డిజాస్టర్ తరువాత హీరోలంతా శ్రీనువైట్లతో సినిమా చేసే విషయంలో కొంతకాలం పాటు ఆలోచించారు. జూనియర్, చెర్రీ, బన్నీ తదితర పెద్ద హీరోలంతా శ్రీనుతో సినిమాలు చేయాల్సి ఉన్నా.. ఆగడు ఎఫెక్ట్ తమ సినిమాపై పడుతుందన్న ఆందోళనలో శ్రీనును కొంతకాలం ఆగమని తప్పించుకున్నారు. వీరిలో మాట మీద నిల్చుంది ఒక్క చెర్రీ మాత్రమే! ఆగడు డిజాస్టర్ అయినా శ్రీను వైట్లతో బ్రూస్‌లీ సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. కనీసం ఈ సినిమా అయినా కొత్తగా ఉంటుందనుకున్న మెగా అభిమానుల ఆశలను శ్రీను నీరు గార్చాడు. చిరంజీవి ప్రత్యేక అప్పియరెన్స్ కూడా సినిమాను కాపాడలేకపోయిందంటే.. సినిమా ఎంతటి పరాజయాన్ని మూటగట్టుకుందో మనందిరకీ తెలిసిందే!
చిన్న హీరోలు సైతం!
దీంతో ఈ పరిస్థితుల్లో పెద్ద హీరోలెవరూ శ్రీనుతో సినిమా చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకే శ్రీనువైట్ల తన పాత ఫార్మాట్‌నే నమ్ముకున్నాడు. ఢీ, రెడీ, సినిమాల తరహాలో చిన్న హీరోలతో సినిమా చేసి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుదామనుకున్నాడు. ఇందుకోసం హీరో రామ్, నాగ చైతన్యలను సంప్రదించగా వారు తొలుత శ్రీనుతో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ రామ్ శ్రీనుతో సినిమాపై ఆసక్తి చూపలేదని తెలిసింది. కనీసం నాగ చైతన్య ఆదుకుంటాడనుకుంటే.. సారీ అండీ రెండేళ్ల దాకా డేట్లు అడ్జస్ట్ కావడం లేదు అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. పాపం! శ్రీనువైట్ల ఒకప్పుడు చిరంజీవి, మహేశ్ బాబులాంటి పెద్ద స్టార్ల సినిమాలతో క్షణం తీరికలేని పెద్ద దర్శకుడు. అలాంటిది ఆగడు, బ్రూస్‌లీ సినిమాలు ఇచ్చిన డిజాస్టర్లతో కుర్ర హీరోలు సైతం శ్రీను వైట్ల పేరు చెబితేనే దూరంగా వెళ్లిపోతున్నారు.
Advertisement