సైకిలెక్కే ముహూర్తం ఖరారు

నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న అనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు, వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించేందుకు టిడిపి అధినేత నుంచి అనుమతి వచ్చినట్టు తెలుస్తోంది. ఆనం సోద‌రులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారే. కానీ […]

Advertisement
Update:2015-11-26 05:28 IST

నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా గుర్తింపు ఉన్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 5న అనం వివేకానందరెడ్డి, రామనారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. రాంనారాయణ రెడ్డికి ఆత్మకూరు, వివేకానందరెడ్డి కుమారుడికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించేందుకు టిడిపి అధినేత నుంచి అనుమతి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆనం సోద‌రులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారే. కానీ తరువాతి రాజ‌కీయ ప‌రిణామాలతో కాంగ్రెస్ లో చేరి వైఎస్ మంత్రివర్గంలో రామ‌నారాయ‌ణ రెడ్డి మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇద్దరూ ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీకి అంటీముట్టనట్టు ఉంటున్నారు. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. అయితే జిల్లా వైసీపీ నాయకులు, జగన్‌ అందుకు అంగీకరించలేదు.

తెలుగుదేశం పార్టీలోకి ఆనం బ్రదర్స్ రాకను జిల్లాలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. అయితే మంత్రి నారాయ‌ణ మాత్రం వీరిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నించి సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబు నుంచి కూడా ఆనం బ్రదర్స్ కు సైకిల్ ఎక్కేందుకు అనుమతి వచ్చిందని తెలియడంతో ఇప్పుడు సోమిరెడ్డి పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశమైంది. టీడీపీలో ప్రచారం జరుగుతున్నట్టు డిసెంబర్ 5న ఆనం సోదరులు పసుపు కండువా కప్పుకుంటే సింహపురి రాజ‌కీయాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Click to Read: AP CS’s comment leave Government employees squirming

Tags:    
Advertisement

Similar News