త్వరలో నారాయణ్ ఖేడ్ ఉప-ఎన్నిక
వరంగల్ పార్లమెంటు ఉప-ఎన్నికలో ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వం నారాయణ్‌ఖేడ్‌పై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! ఈ స్థానంలో తొలుత కిష్టారెడ్డి కుటుంబంలో ఎవరినైనా నిలుపుదామని, పోటీ పెట్టవద్దని కాంగ్రెస్ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్‌ని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ తొలుత అంగీకరించారు. అయితే, అసెంబ్లీలో టీడీపీతో కలిసి రైతు రుణమాఫీ విషయంలో నానా యాగీ చేసిన […]
Advertisement
వరంగల్ పార్లమెంటు ఉప-ఎన్నికలో ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చిన ఉత్సాహంతో ప్రభుత్వం నారాయణ్‌ఖేడ్‌పై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే! ఈ స్థానంలో తొలుత కిష్టారెడ్డి కుటుంబంలో ఎవరినైనా నిలుపుదామని, పోటీ పెట్టవద్దని కాంగ్రెస్ నేత జానారెడ్డి సీఎం కేసీఆర్‌ని కోరారు. దీనికి సీఎం కేసీఆర్ తొలుత అంగీకరించారు. అయితే, అసెంబ్లీలో టీడీపీతో కలిసి రైతు రుణమాఫీ విషయంలో నానా యాగీ చేసిన కాంగ్రెస్ విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం ఉందని ఆరోపణలు పెంచిన కాంగ్రెస్‌కు నారాయణ్‌ఖేడ్ ఉప-ఎన్నికలో విజయం ద్వారానే సమాధానం చెప్పాలని కేసీఆర్ నిర్ణయించారు.
సనత్‌నగర్‌కు ఉప-ఎన్నిక లేనట్లేనా?
టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడిగా కేంద్రం, సీఈసీ, గవర్నర్ వరకు అవకాశం ఉన్న ప్రతిచోటా ఫిర్యాదులు చేశాయి. తలసాని రాజీనామాను ఆమోదించాలని కోరుతూ హైకోర్టు గడప కూడా తొక్కాయి. ఈ నేపథ్యంలో తలసాని రాజీనామా ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రాబోయే ఆర్నెళ్లలో నారాయణ్‌ఖేడ్‌కు ఉప-ఎన్నిక నిర్వహించి గెలిచి తీరాలన్న కసి మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, బీజేపీలపై తెలంగాణలో ఉన్న ఈ వ్యతిరేకత తగ్గకముందే ఉప-ఎన్నిక నిర్వహించాలని ఈసీని త్వరలోనే సీఎం కేసీఆర్ కోరతారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ స్థానంలో గెలిచి చూపించి టీడీపీని, దాని అధినేత చంద్రబాబును తెలంగాణలో చావుదెబ్బ తీయాలని కేసీఆర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని, సనత్‌నగర్‌ను మినహాయించి వెంటనే నారాయణ్‌ఖేడ్ ఉప-ఎన్నిక వైపు సర్కారు మొగ్గు చూపుతోందని సమాచారం.
Advertisement