కేటుగాడు మురుగ " ముస్లిం మహిళనూ ఇన్‌వాల్వ్ చేశాడు

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో టీడీపీ కార్పొరేటర్‌ పద్మావతి భర్త మురుగకు సంబంధించిన చాలా వివరాలను పోలీసులు రాబట్టారు. హత్యలకు స్కెచ్ గీయడంతో పాటు దగ్గరుండి పర్యవేక్షించిన మురుగ… ఓ ముస్లిం మహిళ, మైనర్ అయిన ఆమె కుమారుడిని వారికి తెలియకుండానే హత్యలకు వాడుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో మురుగకు సన్నిహితంగా ఉంటున్న ముస్లిం మహిళ సాయంతోనే బురఖాలు తెప్పించుకున్నాడు . అయితే బురఖాలు హత్యల కోసమని మాత్రం ఆమెకు చెప్పలేదు. అలా ఆమె సాయంతో తెప్పించుకున్న […]

Advertisement
Update:2015-11-25 07:33 IST

చిత్తూరు మేయర్ అనురాధ హత్య కేసులో టీడీపీ కార్పొరేటర్‌ పద్మావతి భర్త మురుగకు సంబంధించిన చాలా వివరాలను పోలీసులు రాబట్టారు. హత్యలకు స్కెచ్ గీయడంతో పాటు దగ్గరుండి పర్యవేక్షించిన మురుగ… ఓ ముస్లిం మహిళ, మైనర్ అయిన ఆమె కుమారుడిని వారికి తెలియకుండానే హత్యలకు వాడుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో మురుగకు సన్నిహితంగా ఉంటున్న ముస్లిం మహిళ సాయంతోనే బురఖాలు తెప్పించుకున్నాడు . అయితే బురఖాలు హత్యల కోసమని మాత్రం ఆమెకు చెప్పలేదు. అలా ఆమె సాయంతో తెప్పించుకున్న బురఖాలనే హంతకులకు అందజేశాడు మురుగ.

అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఉదయమే ముస్లిం మహిళ, ఆమె మైనర్ కుమారుడి చేతిలో ఒక అర్జి పెట్టి మేయర్‌కు ఇవ్వండంటూ పంపించాడు. దీని వెనుక దాగి ఉన్న కుట్రను కనిపెట్టలేకపోయిన తల్లి, కొడుకు మేయర్ చాంబర్‌ దగ్గర ఆమె కోసం నిరీక్షించారు. మేయర్ రాగానే తనకు ఫోన్ చేయమంటూ మైనర్ బాలుడికి ఫోన్‌ ఇచ్చాడు మురుగ. అనుకున్నట్టుగానే మేయర్ అనురాధ తన చాంబర్‌కు రాగానే మైనర్‌ బాలుడు మురుగకు ఫోన్ చేసి ”అక్క వచ్చారు” అని సమాచారమిచ్చాడు. దీంతో వెంటనే ఐదుగురు హంతకులను మురుగ కార్పొరేషన్ కార్యాలయంలోకి పంపించాడు.

ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బాలుడికి ఫోన్ చేస్తూ ఎవరెవరు ఉన్నారని ఆరా తీశాడు. మేయర్ భర్త అక్కడే ఉన్న విషయాన్ని కూడా బాలుడి ద్వారా తెలుసుకున్నాడు. అయితే కుట్ర గురించి తెలియని బాలుడు … మురుగ అడిగిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు చేరవేశాడు. అనురాధను దుండుగలు కాల్చేసిన విషయాన్ని కూడా మైనర్ బాలుడి ద్వారానే మురుగ నిర్ధారించుకున్నాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అయితే మైనర్ కావడం, జరుగుతున్న కుట్ర గురించి తెలియదన్న కారణంతో బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. కేసులో సాక్షిగా చేర్చారు. బాలుడి తల్లిని కూడా సాక్షిగానే పరిగణిస్తున్నారు.

Click to read: Creativity in Titles Too

Tags:    
Advertisement

Similar News