అంబుజాకు బాబు "భూ" భోజనం
కాంగ్రెస్ హయాంలో ఇష్టానుసారం భూములు కేటాయించారని ప్రతిపక్షంలో ఉండగా విమర్శించిన చంద్రబాబు… ఇప్పుడు అంతకంటే జోరుగా భూపందేరం నిర్వహిస్తున్నారు. తాజాగా కర్నూలుజిల్లాలో సిమెంట్ కంపెనీ గుజరాత్ అంబూజాకు వంద ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. లీజు పద్దతిలో కాకుండా ఏకంగా అమ్మేసింది. తొలుత 99 ఏళ్ల కాలపరిమితిలో లీజు ఇవ్వాలని భావించారు. కానీ.. అలా కాకుండా భూమిని అమ్మకం రూపంలో అప్పగించాలని అంబూజ కోరింది. అలా అడగడమే ఆలస్యంగా వంద ఎకరాల భూమిని ఎకరా నాలుగున్నర లక్ష […]
కాంగ్రెస్ హయాంలో ఇష్టానుసారం భూములు కేటాయించారని ప్రతిపక్షంలో ఉండగా విమర్శించిన చంద్రబాబు… ఇప్పుడు అంతకంటే జోరుగా భూపందేరం నిర్వహిస్తున్నారు. తాజాగా కర్నూలుజిల్లాలో సిమెంట్ కంపెనీ గుజరాత్ అంబూజాకు వంద ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. లీజు పద్దతిలో కాకుండా ఏకంగా అమ్మేసింది. తొలుత 99 ఏళ్ల కాలపరిమితిలో లీజు ఇవ్వాలని భావించారు. కానీ..
అలా కాకుండా భూమిని అమ్మకం రూపంలో అప్పగించాలని అంబూజ కోరింది. అలా అడగడమే ఆలస్యంగా వంద ఎకరాల భూమిని ఎకరా నాలుగున్నర లక్ష చొప్పున అప్పగించేశారు. ఇదే మార్కెట్ రేటని ప్రభుత్వం చెబుతోంది. కానీ సీనియర్ అధికారులు మాత్రం భూమి కేటాయించిన ప్రాంతంలో ధర అంతకంటే చాలా రెట్లు అధికంగా ఉందని చెబుతున్నారు.
కర్నూలు జిల్లా జూపాడు మండలంలో ఈ భూమిని కేటాయించారు. ఇక్కడ వంద కోట్ల పెట్టుబడితో టీవీడీ ప్రొసెస్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ చెబుతోంది. గతంలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం 33 ఏళ్ల కాలపరిమితితో లీజుకు ఇచ్చేది. కానీ చంద్రబాబు ఇటీవల అధికారం చేపట్టిన తర్వాత లీజు కాలవ్యవధిని ఏకంగా 99 ఏళ్లకు పెంచారు. ఇటీవల చంద్రబాబు జరిపిన భూ కేటాయింపులు(బయటకు వచ్చినవి) ఒకసారి చూస్తే…
1. సీఆర్‌డీఏ పరిధిలో హీరో బాలయ్య వియ్యంకుడికి నామమాత్రపు ధరకు 300 కోట్ల విలువైన 498 భూమిని అప్పగింత.
2. రేణిగుంట విమానాశ్రయం దగ్గర్లో గల్లా అరుణకుమారి కుటుంబానికి రూ. 48 కోట్ల విలువైన భూమిని ఇచ్చేసిన ప్రభుత్వం.
3. విశాఖలోని మధురవాడ ప్రాంతంలో 50 ఎకరాలను ఎకరం 50 లక్షలకు చొప్పన లోకేష్ స్నేహితుడికి అప్పగింత. అక్కడ ప్రస్తుతం ఎకరం భూమి విలువ రూ. 7.26 కోట్లుగా ఉంది.
4. యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమి కేటాయింపు.
Click to Read Despite Bahubali, Small is beautiful in Tollywood