గుంటూరు మంత్రికి వ్యతిరేకంగా మహిళా నేత ఆమరణదీక్ష
గుంటూరు జిల్లా టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. మంత్రి రావెల కిషోర్‌బాబుకు వ్యతిరేకంగా జిల్లాలోని టీడీపీ నేతలంతా ఏకమవుతున్నారు. మంత్రి సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో ఈ పోరు పీక్‌లో నడుస్తోంది. తాజాగా గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మి మంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఏకంగా ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలంటూ ఆమె దీక్ష చేపట్టారు. తోట లక్ష్మి […]
గుంటూరు జిల్లా టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. మంత్రి రావెల కిషోర్‌బాబుకు వ్యతిరేకంగా జిల్లాలోని టీడీపీ నేతలంతా ఏకమవుతున్నారు. మంత్రి సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో ఈ పోరు పీక్‌లో నడుస్తోంది. తాజాగా గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మి మంత్రి వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఏకంగా ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, నేతలను మంత్రి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కార్యకర్తలకు తగిన న్యాయం చేయాలంటూ ఆమె దీక్ష చేపట్టారు. తోట లక్ష్మి దీక్షకు నియోజకవర్గంలోని నేతలు మద్దతు తెలిపారు. ఆమె తన స్వగ్రామం లాలుపురంలో గత రాత్రి నుంచి దీక్ష ప్రారంభించారు.
ఇటీవల జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు, కిందస్థాయి నాయకులు.. నారా లోకేష్‌ను కలిసి మంత్రి రావెలపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా మార్పులేదని పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. సొంతపార్టీ నేతలకే మంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తోటలక్ష్మి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ స్థాయి పార్టీ మీటింగ్‌లో తోట లక్ష్మి మాట్లాడేందుకు కూడా మంత్రి అంగీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ది పనులు జరగడం లేదని, కార్యకర్తలకు ఏ మాత్రం సాయం చేయలేకపోతున్నామని తోటలక్ష్మి అంటున్నారు. ఇలా ఒకమంత్రికి వ్యతిరేకంగా అధికారపార్టీకే చెందిన మహిళా నాయకురాలు ఆమరణదీక్షకు దిగడం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశమైంది.