నాకెందుకయ్యా... జనవరిలో రిటైర్ అవుతున్నా...!

చంద్రబాబు పాలన ప్రజలకేమోగానీ సీనియర్ అధికారులకే దిమ్మతిరిగేలా సాగుతోందని అధికార వర్గాలు వాపోతున్నాయి. చాలా మంది అధికారులు విసిగిపోయి తమకెందుకు ఈ కర్మ అనే స్థాయికి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అందుకు ఇటీవల అద్దెల చెల్లింపు వ్యవహారంలో నడుస్తున్న తంతును కొందరు అధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో నివసించేందుకు ఇంకా 10ఏళ్లు గడువున్నా… ఇటీవల ఉద్యోగులంతా బెజవాడ బస్సు ఎక్కాల్సిందేనని చంద్రబాబు  పదేపదే చెబుతున్నారు.  అక్కడి ఇంకా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో  అద్దె భవనాలను లీజు తీసుకుని వాటిలో పాలన సాగించాలని అనుకుంటున్నారు.  అయితే భవనాలకు […]

Advertisement
Update:2015-11-23 10:03 IST

చంద్రబాబు పాలన ప్రజలకేమోగానీ సీనియర్ అధికారులకే దిమ్మతిరిగేలా సాగుతోందని అధికార వర్గాలు వాపోతున్నాయి. చాలా మంది అధికారులు విసిగిపోయి తమకెందుకు ఈ కర్మ అనే స్థాయికి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అందుకు ఇటీవల అద్దెల చెల్లింపు వ్యవహారంలో నడుస్తున్న తంతును కొందరు అధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో నివసించేందుకు ఇంకా 10ఏళ్లు గడువున్నా… ఇటీవల ఉద్యోగులంతా బెజవాడ బస్సు ఎక్కాల్సిందేనని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అక్కడి ఇంకా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో అద్దె భవనాలను లీజు తీసుకుని వాటిలో పాలన సాగించాలని అనుకుంటున్నారు. అయితే భవనాలకు చదరపు గజానికి ఎంత అద్దె చెల్లించాలన్న దానిపై చంద్రబాబు మైండ్ సెట్ ఒకలా అధికారుల ఆలోచన మరోలా ఉందని చెబుతున్నారు.

ప్రస్తుతం చ‌ద‌ర‌పు గ‌జం హైద‌రాబాదులోనే 14 రూపాయల నుంచి 20 రూపాయ‌లు చెల్లిస్తే బంజారాహిల్స్, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో అద్దాల మేడ‌లు అద్దెకివ్వ‌డానికి ఎందరో రెడీగా ఉన్నారు. కానీ కాసులు లేవని చెప్పే చంద్రబాబు బెజవాడలో చిన్నచిన్న భవనాలకే చదరపు గజానికి 40 రూపాయలు చెల్లించేందుకు రెడీ అవడంతో అధికారులు ఖంగుతింటున్నారు. విజయవాడలో చదరపు గజానికి 40 రూపాయలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు అవాక్కయ్యారు. అసలు రూల్స్‌ ప్రకారం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో 14 రూపాయ‌ల‌కు మించి చదరపు గజానికి అద్దె చెల్లించ‌డానికి చట్టాలు ఒప్పుకోవని అధికారులు సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు సలహాలు ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో చంద్రబాబు ఓరేంజ్‌లో పైర్ ”ఇవ్వ‌మ‌ని డిసైడ్ చేయ‌డానికి మీరెవ‌రూ? అది డిసైడ్ చేయాల్సింది నేను” అంటూ మ‌హేష్ బాబు లెవ‌ల్లో డైలాగ్ పేల్చారట చంద్రబాబు. వాళ్లు అడిగినట్టు 40 రూపాయ‌లు చెల్లించండి అంటూ హుకూం జారీ చేశారట.

సీనియర్ అధికారులంతా ప్రభుత్వ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారని సమాచారం. ”మీరైనా చెప్పండి సర్… ఇలాగా ఇష్టానుసారం అద్దెలు చెల్లించడం కరెక్ట్ కాదని” పెద్ద అధికారి ముందు వాపోయారట. వారు చెప్పేదంతా శ్రద్దగా విన్న కృష్ణారావు… ఒకే మాటతో సరిపెట్టారని అధికారులు చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పిన డైలాగ్ ఏమిటంటే… ”అయినా ఇందంతా నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా… వచ్చే జూన్ 1 నాటికి సంబంధించిన విషయాలు నాకెందుకంటూ” చేతులెత్తేశారట. దీంతో ఆయన దగ్గరకు వచ్చిన అధికారులంతా ఖంగుతిన్నారు. పెద్ద సారే అలా అనే సరికి తత్వం బోధపడింది. పాలనలో మార్పు కోరుకోవడం… చంద్రబాబుకు సలహాలివ్వడం మానుకుని బుద్దిగా ఇచ్చిన పని చేసుకుపోవడం బెటరంటూ బయటకు వచ్చేశారట. దీని బట్టి ఏ అధికారి కూడా మనస్పూర్తిగా ప్రభుత్వం పాలనలో భాగస్వామ్యం కాలేదన్న విషయం అర్థమవుతోందని యంత్రాంగం చెప్పుకుంటోంది.

కృష్ణారావు ఈస్థాయిలో విసిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. అన్నింటికన్నా ఇటీవల అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయనను చంద్రబాబు ట్రీట్ చేసిన విధానంతో బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. సీఎస్‌గా ఉన్న తనకు వేదికపై కూర్చునే అవకాశం కల్పించకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారట. ఈ విషయాన్ని కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో బయటపెడుతున్నారు.

Click to Read in English

Tags:    
Advertisement

Similar News