నా అనుభవమంత లేదు... నీ వయసు
సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావును చంద్రబాబు పేషీ అధికారులే లెక్కచేయలేదు. తన నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం డిజైన్ చేసిన ప్రాజెక్టు ఆమోదం కోసం చాలా రోజుల క్రితమే రాయపాటి… చంద్రబాబు కార్యాలయానికి ఫైల్ పంపారు. అయితే అది ఎంతకు ముందుకు కదలలేదు. దీంతో నేరుగా రాయపాటే సీఎంవోకు వెళ్లారు. ఫైల్ ఉన్న అధికారి దగ్గరకు నేరుగా వెళ్లి సంప్రదించారు. అయితే సదరు అధికారి రాయపాటిని సరిగా రిసీవ్ చేసుకోలేదట. కూర్చీలో అటూ ఇటూ ఊగుతూనే మాట్లాడారట. కనీసం […]
సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావును చంద్రబాబు పేషీ అధికారులే లెక్కచేయలేదు. తన నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం డిజైన్ చేసిన ప్రాజెక్టు ఆమోదం కోసం చాలా రోజుల క్రితమే రాయపాటి… చంద్రబాబు కార్యాలయానికి ఫైల్ పంపారు. అయితే అది ఎంతకు ముందుకు కదలలేదు. దీంతో నేరుగా రాయపాటే సీఎంవోకు వెళ్లారు. ఫైల్ ఉన్న అధికారి దగ్గరకు నేరుగా వెళ్లి సంప్రదించారు. అయితే సదరు అధికారి రాయపాటిని సరిగా రిసీవ్ చేసుకోలేదట. కూర్చీలో అటూ ఇటూ ఊగుతూనే మాట్లాడారట. కనీసం కూర్చోవాల్సిందిగా కోరకపోవడంతో అధికారిపై రాయపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ”ఏం అనుకుంటున్నారు మీరంతా… నా సీనియారిటీ అంత లేదు నీకు వయసు. ప్రజాప్రతినిధి వస్తే ఎలా వ్యవహరించాలో తెలియదా… అసలు నీవు ఐఏఎస్ ఎలా అయ్యావు…..” అంటూ ఎంపీ ఫైర్ అయ్యారు.
అయినా సరే ప్రాజెక్టు విషయం తన పరిధిలో తేల్చలేనని… ముఖ్యమంత్రితో మాట్లాడుకోవాలని కూల్‌గా చెప్పేశారట సదరు అధికారి. అందుకు రాయపాటి ”నేను మాట్లాడుతున్నది ప్రాజెక్టు గురించి కాదు… నీ బిహేవియర్ గురించి…” అంటూ మరోసారి అధికారిపై విరుచుకుపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండని అటుగా వచ్చిన మరో అధికారికితో రాయపాటి చెప్పి వెళ్లిపోయారు. ”అధికారులు ప్రోటోకాల్ పాటించాలి. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు లేచి నిలబడి గౌరవించాలి. తిరిగి వెళ్లేటప్పుడు డోర్ వరకు వచ్చి సాగనంపాలి” ఈ విషయాలు గుర్తు పెట్టుకుని డ్యూటీ చేయండంటూ రాయపాటి వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.