పొట్ట చుట్టుకొలతే...అసలు ప్రమాదం
మీ నడుము కింది భాగం (హిప్స్)కంటే పొట్ట చుట్టుకొలత పెరుగుతోందా…అయితే మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు వైద్య పరిశోధకులు. బెల్లీఫ్యాట్ ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మరి, పొట్ట ఎక్కువగా ఉందా, మన ఆరోగ్యానికి అంత ముప్పుతెచ్చే పరిమాణంలో ఉందా…అనే విషయాన్ని ఎలా కనుక్కోవాలి? ఇందుకు వారు ఒక చిన్న సింపుల్, స్వీయ పరీక్షని ఉపాయంగా చెబుతున్నారు. ఒక దారం ముక్కని తీసుకుని ముందు, ఎత్తుగా ఉన్న పొట్టభాగాన్ని కొలుచుకుని, […]
మీ నడుము కింది భాగం (హిప్స్)కంటే పొట్ట చుట్టుకొలత పెరుగుతోందా…అయితే మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత జాగ్రత్త వహించాల్సిందే అంటున్నారు వైద్య పరిశోధకులు. బెల్లీఫ్యాట్ ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. మరి, పొట్ట ఎక్కువగా ఉందా, మన ఆరోగ్యానికి అంత ముప్పుతెచ్చే పరిమాణంలో ఉందా…అనే విషయాన్ని ఎలా కనుక్కోవాలి? ఇందుకు వారు ఒక చిన్న సింపుల్, స్వీయ పరీక్షని ఉపాయంగా చెబుతున్నారు. ఒక దారం ముక్కని తీసుకుని ముందు, ఎత్తుగా ఉన్న పొట్టభాగాన్ని కొలుచుకుని, తరువాత అదే దారంతో నడుముకింద హిప్స్ భాగాన్ని కొలవాలి. హిప్స్ భాగం కంటే పొట్ట తక్కువగా ఉంటే పరవాలేదు, కానీ పొట్టే ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదమేనట. ఎంతగా ప్రమాదం అంటే, స్థూలకాయంతో బాధపడుతున్నవారికి కలిగే ఆరోగ్య నష్టాలకంటే, శరీరం సన్నగానే ఉన్నా హిప్స్ భాగం కంటే పొట్ట ఎక్కువగా ఉన్నవారికి కలిగే నష్టం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి ఎంత లావున్నాం…అనే దానికంటే పొట్ట ఎంత పెరిగింది అనేది మరింత ప్రాధాన్యత కలిగిన అంశంగా భావించాలని ఈ పరిశోధనను నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు.
బాడీ మాస్ ఇండెక్స్కీ, శరీరంలో కొవ్వు వ్యాపించిన విధానానికి మధ్య ఉన్న అనుబంధంపై వీరు అధ్యయనం చేశారు. శరీరం లావుగా ఉన్నా ఆ బరువు అన్ని భాగాలకూ సమానంగా విస్తరించి ఉన్నవారికంటే, శరీరం సన్నగా ఉండి, పొట్టలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయినవారికే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువని వారు చెబుతున్నారు. పొత్తికడుపు, హిప్స్కి సంబంధించిన చుట్టుకొలత నిష్పత్తి మహిళల్లో అయితే .85, 1గానూ, పురుషుల్లో అయితే .9,1గానూ ఉండవచ్చని వీరు సలహా ఇస్తున్నారు. కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగానే ఉంది కదా, మాకేం హాని లేదులే అని, పొట్ట ఎక్కువగా ఉన్నవారు బావించరాదని హెచ్చరిస్తున్నారు. కొంతమంది క్రీడాకారుల బాడీమాస్ ఇండెక్స్ 30 ఉన్నా వారి పొట్ట, హిప్స్ నిష్పత్తి సరిగ్గా ఉండటం కారణంగా హాని ఉండదని వారు చెబుతున్నారు. క్రీడాకారుల్లో కొవ్వు కంటే కండరాల బరువు హెచ్చుగా ఉంటుంది. ఏదిఏమైనా శరీర బరువుతో సంబంధం లేకుండా, పొట్టని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది.