కేజ్రీవాల్‌పై నెటిజన్ల సెటైర్లు

ఒకరేమో దేశంలో అవినీతిని పారద్రోలతానంటూ చీపురు పట్టి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. మరొకరేమో అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలుశిక్ష కూడా అనుభవించిన నాయకుడు. ఇద్దరికీ పొంతనే లేదు. కానీ నితీష్‌ ప్రమాణస్వీకారం వారిద్దరినీ కలిపింది. వాళ్లిద్దరెవరో కాదు.. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. అవును పాట్నాలో సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్రప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడీని ఎదిరించి […]

Advertisement
Update:2015-11-21 05:46 IST

ఒకరేమో దేశంలో అవినీతిని పారద్రోలతానంటూ చీపురు పట్టి రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. మరొకరేమో అవినీతి కేసుల్లో చిక్కుకుని జైలుశిక్ష కూడా అనుభవించిన నాయకుడు. ఇద్దరికీ పొంతనే లేదు. కానీ నితీష్‌ ప్రమాణస్వీకారం వారిద్దరినీ కలిపింది. వాళ్లిద్దరెవరో కాదు.. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. అవును పాట్నాలో సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

కేంద్రప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడీని ఎదిరించి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాకూటమి తరుఫున నితీష్ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఈ వేడుకకు హాజరయ్యాయి. మమతా బెనర్జీ నుంచి ఇతర బీజేపీ యేతర నాయకులంతా స్టేజ్‌పై ఆశీనులయ్యారు. అయినా అందరి దృష్టిమాత్రం కేజ్రీవాల్, లాలూపైనే. వారిద్దరూ ఒకరికొకరు పలకరించుకోవడమే కాదు… షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

ఇద్దరి ఆలింగనంపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు నెటిజన్లు. ఒకరిది అవినీతి చరిత్ర….మరొకరిది అవినీతి వ్యతిరేక పోరాట చరిత్ర… ఇద్దరూ ఒక్కచోట కలిస్తే. కౌగిలించుకొని ముచ్చట్లు చెప్పుకుంటే…ఇండియన్‌ పాలిటిక్స్‌లో ఏదైనా సాధ్యమే అంటూ సెటైర్లు వేశారు. నెటిజన్ల విమర్శలను ఆమ్ ఆద్మీపార్టీ కొట్టిపారేసింది. కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని… కేజ్రీవాల్‌, లాలు శత్రువులు ఏమీ కాదని, ఒకరికొకరు ఎప్పుడూ ద్రోహం చేసుకోలేదని, ఒకరి రాజకీయాల్లో మరొకరు జోక్యం చేసుకోలేదని… అలాంటప్పుడు ఒక సందర్భంగా కలిసినప్పుడు ఆత్మీయంగా పలకరించుకుంటే తప్పుఏమిటని ఆమ్‌ఆద్మీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లాలూ అవినీతిని ఎత్తిచూపే నేతలు, నెటిజన్లు మనదేశంలో వేళ్లమీద లెక్కపెట్టదగిన నీతిపరులైన నాయకులను తప్పిస్తే మిగిలినవాళ్లంతా అవినీతిపరులు కాదా? దొరికాడు కాబట్టి లాలూ అవినీతిపరుడు అయ్యాడుకాని దేశంలో నాయకులంతా ఎన్ని వందల వేలకోట్ల అవినీతిలో మునిగితేలుతున్నారో తెలియదా అని ఆమ్‌ఆద్మీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నితీశ్ ప్రమాణస్వీకారం సందర్భంగా అక్కడున్న లాలూను కేజ్రీవాల్‌ కలిశారని.. అందులో తప్పుపట్టవలసినది ఏముందని… శత్రువునైనా ఆత్మీయంగా పలకరించడం భారతీయ సంస్కృతిలో భాగమని ముఖ్యంగా బీజేపీ నేతలు భారతీయ సంస్కృతిని అర్ధంచేసుకోవాలని ఆమ్‌ఆద్మీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News