గోతులు తవ్వుకుంటున్న ఉమ, సీఎం

ఏపీ ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలను టీడీపీ నేతలే బయటపెట్టుకుంటున్నారు. ఇటీవల గాలేరునగరి సుజలస్రవంతిలో సీఎం రమేష్‌కు చెందిన కంపెనీ చేపట్టిన పని అంచనా వ్యయాన్ని 12 కోట్ల నుంచి 110 కోట్లకు పెంచిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు పరిపాలన అనుమతులు లేకుండానే సీఎం రమేష్‌కు 35 కోట్లు చెల్లించినట్టు బయటపడింది.ఈ విషయం బయటకు రావడానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని  ఉమయే  కారణమని సీఎం రమేష్‌ అనుమానిస్తున్నారని ఒక ప్రముఖ దిన పత్రిక కథనాన్ని రాసింది.. […]

Advertisement
Update:2015-11-21 05:31 IST

ఏపీ ప్రభుత్వంలో అవినీతి వ్యవహారాలను టీడీపీ నేతలే బయటపెట్టుకుంటున్నారు. ఇటీవల గాలేరునగరి సుజలస్రవంతిలో సీఎం రమేష్‌కు చెందిన కంపెనీ చేపట్టిన పని అంచనా వ్యయాన్ని 12 కోట్ల నుంచి 110 కోట్లకు పెంచిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు పరిపాలన అనుమతులు లేకుండానే సీఎం రమేష్‌కు 35 కోట్లు చెల్లించినట్టు బయటపడింది.ఈ విషయం బయటకు రావడానికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమయే కారణమని సీఎం రమేష్‌ అనుమానిస్తున్నారని ఒక ప్రముఖ దిన పత్రిక కథనాన్ని రాసింది.. వాటాల పంపకాల్లో తేడా వల్లే ఇలా బయటపెట్టారని రాసింది. ఈనేపథ్యంలోనే సీఎం రమేష్ ప్రతీకారంగా మరో అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు. అక్రమాలపై ఏకంగా ఆర్థిక ముఖ్యకార్యదర్శికి లేఖ రాసి కలకలం సృష్టించారు.

అవుకు రిజర్వాయర్‌ సొరంగం పనులకు అదనంగా 44 కోట్ల రూపాయలను చెల్లించడాన్ని లేఖలో ప్రశ్నించారు. రూ. 401 కోట్లతో చేపట్టిన సొరంగం పనులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంచనాలు పెంచబోమని నిబంధనల్లో ఉంది. అయినా ప్రభుత్వం తాజాగా రూ.44 కోట్ల అదనపు చెల్లింపుకు అంగీకరించింది. దీన్నే సీఎం రమేష్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కోరిన వెంటనే ఈ అదనపు చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ అదనపు చెల్లింపులు మంత్రి దేవినేని ఉమ కనుసన్నల్లోనే జరిగిందని సీఎం రమేష్ భావిస్తున్నారని సదరు పత్రిక అభిప్రాయం.. అందుకే ఈ తంతును ప్రశ్నిస్తూ లేఖరాశారని చెబుతున్నారు. గాలేరులో అవినీతిని బయటపెట్టి తనకు రూ. 35 కోట్లకు గండికొట్టిన దేవినేని ఉమపై… అవుకు రిజర్వాయర్ అక్రమాలను బయటపెట్టడం ద్వారా రమేష్ ప్రతీకారం తీర్చుకున్నారని రాసింది. అయితే ఇలా పోటీ పడి ఒకరి అవినీతి గోతులను మరొకరు తవ్వుకుంటే చివరకు పార్టీ కొంప మునుగుతుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఏదైనా పరస్పర అవగాహనతో ముందుకెళ్తే బాగుంటుందంటున్నారు.

Tags:    
Advertisement

Similar News