మోదీగారు పక్కలో ఏం జరుగుతోందో చూసుకోండి సార్‌!

కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ సదస్సులో మన జాతీయ జెండాకు అవమానం జరిగింది. అది కూడా ప్రధాని మోదీ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. జపాన్ ప్రధాని షిన్జో అబెతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు మీడియాకు పోజు ఇచ్చారు. ఈ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన భారత జాతీయ జెండా తిరగేసి ఉంది. సాధారణంగా కషాయం రంగు జెండాపై భాగాన ఉండాలి. కానీ అక్కడ మాత్రం కాషాయం కిందకు ఆకుపచ్చ వర్ణంపైకి ఉండేలా జెండా ఉంచారు. […]

Advertisement
Update:2015-11-21 13:44 IST

కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఆసియన్‌ సదస్సులో మన జాతీయ జెండాకు అవమానం జరిగింది. అది కూడా ప్రధాని మోదీ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. జపాన్ ప్రధాని షిన్జో అబెతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు మీడియాకు పోజు ఇచ్చారు. ఈ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన భారత జాతీయ జెండా తిరగేసి ఉంది.

సాధారణంగా కషాయం రంగు జెండాపై భాగాన ఉండాలి. కానీ అక్కడ మాత్రం కాషాయం కిందకు ఆకుపచ్చ వర్ణంపైకి ఉండేలా జెండా ఉంచారు. ఇది గమనించకుండానే జపాన్‌ ప్రధానితో కలిసి మోదీ మీడియాకు స్టిల్ ఇచ్చారు. వెంటనే అధికారులు అప్రమత్తమైనా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మ్యాటర్ వీడియోలకు, ఫోటోలకు ఎక్కిపోయింది. అయితే వీడియోల్లోనూ జాతీయ జెండా తిరగేసి ఉన్నట్టు స్పష్టంగా ఉంది. కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ఫోటోలో మాత్రం జెండా సజావుగానే ఉంది.

Tags:    
Advertisement

Similar News