ఆంధ్రజ్యోతిపై మండిపడ్డ కవిత
తెలంగాణలో ఇప్పటికే అప్రకటిత నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రజ్యోతిపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. ఈసీకి ఎన్నికల ఖర్చును తప్పుగా చూపించారంటూ కథనం ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌పై మండిపడ్డారు. ఇకపై తెలంగాణ జాగృతి నిర్వహించే ప్రెస్‌మీట్లు, కార్యక్రమాలకు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను ఆహ్వానించబోమని చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలని ప్రజలకు కవిత పిలుపునిచ్చారు. తప్పుడు కథనాలు రాయడం ఆంధ్రజ్యోతికి అలవాటుగా మారిందన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు కరపత్రంగా మారిందన్నారు. ఇలాంటి జ్యోతులను చాలా చూశామన్నారు. ఈసీ […]
తెలంగాణలో ఇప్పటికే అప్రకటిత నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆంధ్రజ్యోతిపై ఎంపీ కవిత ఫైర్ అయ్యారు. ఈసీకి ఎన్నికల ఖర్చును తప్పుగా చూపించారంటూ కథనం ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌పై మండిపడ్డారు. ఇకపై తెలంగాణ జాగృతి నిర్వహించే ప్రెస్‌మీట్లు, కార్యక్రమాలకు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను ఆహ్వానించబోమని చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలని ప్రజలకు కవిత పిలుపునిచ్చారు. తప్పుడు కథనాలు రాయడం ఆంధ్రజ్యోతికి అలవాటుగా మారిందన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు కరపత్రంగా మారిందన్నారు. ఇలాంటి జ్యోతులను చాలా చూశామన్నారు. ఈసీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. బహుషా ఆంధ్రజ్యోతి అడ్రస్‌కు నోటీసులు వెళ్లాయేమోనని కవిత అన్నారు.