సంక్రాంతి రేసులోకి మరో పెద్ద సినిమా

సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో, బాలయ్య చేస్తున్న డిక్టేటర్ సినిమాలు పొంగల్ వార్ కు కత్తులు దూస్తున్నాయి. రెండు సినిమాలూ పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి యుద్ధం నందమూరి హీరోల మధ్యే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మధ్యలోకి అక్కినేని స్టార్ కూడా వచ్చిచేరాడు. అవును.. పొంగల్ కు నాగార్జున నటించిన తాజా చిత్రం కూడా రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని […]

Advertisement
Update:2015-11-17 00:33 IST
సంక్రాంతి బరిలో ఇప్పటికే రెండు సినిమాలు సిద్ధమయ్యాయి. ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో, బాలయ్య చేస్తున్న డిక్టేటర్ సినిమాలు పొంగల్ వార్ కు కత్తులు దూస్తున్నాయి. రెండు సినిమాలూ పోటాపోటీగా తెరకెక్కుతున్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి యుద్ధం నందమూరి హీరోల మధ్యే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు మధ్యలోకి అక్కినేని స్టార్ కూడా వచ్చిచేరాడు. అవును.. పొంగల్ కు నాగార్జున నటించిన తాజా చిత్రం కూడా రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమా చేస్తున్నాడు నాగ్. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత మూవీ కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నాగార్జున పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. అందుకే తాడోపేడో తేల్చుకోవడానికి సంక్రాంతి బరిలో నిలిచాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 15న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను విడుదల చేయనున్నారు.
ప్రస్తుతానికైతే సంక్రాంతికి ఈ 3 సినిమాలు పక్కా అయ్యాయి. జనవరి 8న నాన్నకు ప్రేమతో.. జనవరి 14న డిక్టేటర్.. జనవరి 15న సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. మరి వీటిలో ఏ సినిమా రేసు నుంచి తప్పుకుంటుందో చూడాలి.
Tags:    
Advertisement

Similar News