నాగార్జున నమ్మకం కోల్పోయిన శ్రీనువైట్ల

అఖిల్ రెండో సినిమాపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. దాదాపుగా అఖిల్ రెండో సినిమాను డైరక్ట్ చేసే బాధ్యతను క్రిష్ కు అప్పగించినట్టే తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ తో సంప్రదింపులు జరిగిన నాగార్జున, ఈ విషయాన్ని దాదాపుగా ఖరారు చేశారు. అఖిల్ ను డైరక్ట్ చేసేందుకు క్రిష్ కూడా సంసిద్ధత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి క్రిష్-అఖిల్ కాంబోలో సినిమా సెట్స్ పైకి రానుంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుంది. కంచె సినిమా […]

Advertisement
Update:2015-11-17 00:32 IST
అఖిల్ రెండో సినిమాపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. దాదాపుగా అఖిల్ రెండో సినిమాను డైరక్ట్ చేసే బాధ్యతను క్రిష్ కు అప్పగించినట్టే తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ తో సంప్రదింపులు జరిగిన నాగార్జున, ఈ విషయాన్ని దాదాపుగా ఖరారు చేశారు. అఖిల్ ను డైరక్ట్ చేసేందుకు క్రిష్ కూడా సంసిద్ధత వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి క్రిష్-అఖిల్ కాంబోలో సినిమా సెట్స్ పైకి రానుంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుంది. కంచె సినిమా సక్సెస్ తో క్రిష్ కు ఈ అవకాశం వచ్చింది.
నిజానికి అఖిల్ రెండో సినిమాను శ్రీనువైట్లతో అనుకున్నారు. అఖిల్ సినిమా సెట్స్ పై ఉంటున్న టైమ్ లోనే వైట్లతో రెండో సినిమా ఫ్లాన్ చేశాడు నాగార్జున. కానీ శ్రీనువైట్ల చేసిన బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అవ్వడం, అతడి దర్శకత్వంపై విమర్శలు బాగా ఎక్కువవ్వడంతో నాగార్జున వెనక్కి తగ్గాడు. అఖిల్ రెండో సినిమాను శ్రీనువైట్లకు అప్పగించకుండా క్రిష్ ను ఎంపికచేశాడు. అలా వైట్ల స్థానంలోకి క్రిష్ వచ్చి చేరాడు.
Tags:    
Advertisement

Similar News