నాలుగు ముక్కలు కానున్న గ్రేటర్ హైదరాబాద్

కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసేయోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త జిల్లాలపై ఏర్పాటైన కమిటీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.  గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదన ఉందని మంత్రి పద్మారావు కూడా చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ విస్తీర్ణం భారీగా పెరిగిపోవడం… శివారు ప్రాంతాల వారికి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కలెక్టరేట్లు చాలా దూరంగా ఉండడంతో   రావడానికి ఇబ్బందులు పడుతున్నారు.  వీటికి తోడు ఇప్పటికే సికింద్రాబాద్, వికారాబాద్‌ల పరిధిలో ప్రత్యేక […]

Advertisement
Update:2015-11-17 04:53 IST

కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ను నాలుగు ముక్కలు చేసేయోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త జిల్లాలపై ఏర్పాటైన కమిటీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదన ఉందని మంత్రి పద్మారావు కూడా చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్ విస్తీర్ణం భారీగా పెరిగిపోవడం… శివారు ప్రాంతాల వారికి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కలెక్టరేట్లు చాలా దూరంగా ఉండడంతో రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు ఇప్పటికే సికింద్రాబాద్, వికారాబాద్‌ల పరిధిలో ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది.

ప్రభుత్వం ఆలోచన ప్రకారం ఉప్పల్, బోడుప్పల్, ఘట్‌కేసర్‌ ప్రాంతాలతో ఒక జిల్లా ఏర్పాటు యోచన ఉంది. అల్వాల్, మల్కాజ్‌గిరి, శామీర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్‌ ప్రాంతాలు మరో జిల్లాగా ఆవిర్భవించనున్నాయి. ఓల్డ్ సిటీతో పాటు రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాలతో హైదరాబాద్ జిల్లా కొనసాగుతుంది. సైబరాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సైబరాబాద్‌, శేరిలింగపల్లి, చేవెళ్ల, మనికొండ తదితర ఏరియాలతో కలిసి కొత్త జిల్లా ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఆలోచన నేపథ్యంలో సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. కొందరు స్థానిక నేతలు ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసి తన డిమాండ్‌ను వినిపించారు. హైదరాబాద్‌ పరిధిలో జరిగిన స్థాయిలో సికింద్రాబాద్‌ పరిధిలో అభివృద్ది జరగలేదని వారు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News